పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

135

నాలిమంగళసూత్ర మది యాదిగాఁగ - లీల నర్ధంబు సెల్లించునత్తఱిని
[1]దిరుపరంధామమం దురగేశ్వరేశుఁ - డురగకన్యక లతిస్ఫురణమైఁబాడ
సోలి ముందటి కింత వ్రాలుడు ధరణి - పాలుఁడు మును పెక్కుపాయంబులందుఁ
జక్కొల్పఁ జాలక సంచలింపంగ - నక్కడి కేఁగి యత్యర్థిఁదుల్కాడ
“వలసినయంత గుగ్గిలము నాకిండు - నిలిపెదఁ జక్కఁగా నిటలాక్షు” ననుడు
మహినొక్కవ్రోఁకగా మహిసాక్షివోసి - మహిపతి యొప్పించి మహిఁజాఁగిమ్రొక్కి
యలరుచుఁగైకొని యఖిలంబునెఱుఁగ - బలువుగానొకపటు(ట?) వలి[2]చించియొక్క
దిక్కీశుతోడ సంధించి వేఱొక్క - దిక్కు శస్త్రంబుతోఁ దిగిచి బంధించి
గ్రక్కున శస్త్రంబుఁ గంఠంబునందు - నెక్కొల్పి వెనుకకు [3]నిగుడంగఁదడవ
యెప్పటియట్ల నాగేశుండు నిలిచి - యప్పుడు ప్రత్యక్షమై కరుణింప
నలి దీటుకొన నపునర్భవలీల - వెలసిన గుగ్గులుకళియారిబంట

అరివాళు నయనారి కథ


లీల వెండియుఁదన లింగంబునకుఁద్రి - కాలంబు నియమంబుగా రాజనంబు
ప్రాలోగిరము సమర్పణసేసి తాను - నాలింగ[4]లీనమై యట్లువర్తింపఁ
దమ మొల్లమంతయుఁ దత్కారణమున - సమయుడు నొండుపాయము లేమిఁజేసి
కొడవలి గడియించికొనుచుఁగైకూలి - వడి రాజసములకు నొడఁబాటు చేసి
పట్టిననియమంబు [5]వ్రతి వాల్చుచుండ - నట్టిచోఁగూలియుఁబుట్టకయున్న
[6]నిట్టుపవాస మేన్దినము లుండంగ - నెట్టకేలకు బియ్య మిరుస గల్గినను
సరసరఁగొనివచ్చు సంభ్రమంబునను - ధరఁదాఁకి పడి[7]న నెత్తఁగ రాక ప్రాలు
[8]నెరియలపాలైనఁ"బురహర! నీకుఁ - గరమర్థి నర్పింపఁగా నేఁగుదెంచు
నత్తఱి విచ్ఛిన్నమయ్యె నేనింకఁ - జత్తునకా” కంచుసంశయం బుడిగి
పెడకచ్చకొడవలి మెడఁబెట్టి మూఁపు - తడుపంట సంధించి తన్నంగఁదడవ
పరమేశ్వరుం డట్టి బాసకు మెచ్చి - ధరణిఁ బ్రసన్నుఁడై కరుణఁజూచుడును
బరమపునర్భవప్రాప్తుఁడై యున్న - యరివాళు నయనారి కనుఁగు భృత్యుండ

అడిభర్తుని కథ


మఱియును నప్పాండ్యమండలంబునను - మఱియొండు గాయకం బెఱుఁగమిఁ జేసి

  1. దిరువరందామయం
  2. చిందె(ది)నొక్క
  3. నీల్గంగఁ
  4. లింగియై
  5. ప్రతిపాల్చు
  6. నిట్రుపవాస
  7. బియ్యము రివెత్తరాక
  8. సరియల