పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

125

[1]నోరవోఁజూచునే యొగిఁదన్నుడాఁచి - [2]యారఁబ్రాణంబున కాసించె నతఁడు
తమసుతుఁడైన జంగమమ కాఁడెట్లు? - సమయింపఁగూడునే శంక దాలేక!
పొరుగింటిచిచ్చైనఁదరికొనుఁగాని - దరికొనదే [3]యిట్లు దమయింటిచిచ్చు
వెలుపలిదుఃఖంబు వెలిఁబోయెననినఁ - బొలుపయ్యె నిట్లుండవలవదే భక్తి?
మృడునకు నరమాంసమేకాని యొండు - మెడకుఁబోదయ్యెనో మేలయ్యెననుచుఁ
దలర కీశ్వరుమీఁదఁదా నింతభక్తి - గలవాఁడు శాకపాకములు గావించి
యన్నీలగళునకుఁదన్నేల పెట్టఁ - డెన్నంగ నిది భక్తహింస గాదెట్లు
తనయుని నొప్పించెఁదన్ను వంచించె - ననుమాట [4]కోడి పుత్త్రు నపుడ పిలువఁ
బంచెఁగా “కప్పు డర్పించితిఁబిలువఁ - బంచుట యిది భక్తి [5]పాటిగా దింక”
ననియెనే చిఱుతొండఁడట్లునుగాక - చనుదెంచి యర్థించి చంపించినట్టి
మనసిజారియును మ్రింగన(?)గొండియయ్యె - ననుమాట కంజిపుత్త్రుని నపు డుమిసెఁ
గాక త్రేన్పులు గఱ్ఱుగఱ్ఱున వెడలఁ - జేకొని యారగించెనె కడుపార
సెట్టికిఁగర్మంబుఁ దిట్టు దేవరకుఁ - గట్టిల్లె నింతియ [6]కాదె కావునను
భక్తుని మ్రింగిన పచ్చిరక్కసుఁడు - భక్తుని జంపఁ బాల్పడు సూనెగాఁడు
నిది యొక్క కథయుఁగా నిల రచియించి - చదువుమూఢులకు నసంఖ్యాతులకును
వెలియుఁజుండో” యని వ్రేసెఁ జేతాళ - మలుక రెట్టింపంగ నా హలాయుధుఁడు
అంత నత్యంత భయభ్రాంతిఁబొంది - యంతకారియు సిరియాలుండు నతని
యక్కజంబైనకోపాటోపదృష్టి - కొక్కింత గెలఁకుల [7]కోసరించుచును
నుల్లము ల్గలఁగ నొండొరుల మొగంబు - లల్లన చూచుచుఁ దలడిం[8]చుచును
నున్న యిద్దఱ హలాయుధుఁడు వీక్షించి - "మన్నింపఁదగు జంగమములుగా మిమ్ము
నిట క్రిందిమాటలకేఁదప్పువట్ట - నిటమీఁద సిరియాలు నీశ్వరువార్త
మఱచి యాడితిరేని మా భక్తు లెడకు - మఱి మీరు హరుని కోమటి తోడివార”
లనవుడు నుత్తరం బాడంగ వెఱచి - మనసిజారియును నుమాకాంతఁదలఁపఁ

పార్వతి సంగళవ్వతో నేతెంచి తమ పతుల వెలిదీర్ప హలాయుధుని వేఁడుట


బార్వతియును దాను భక్తియన్ సుదతి - సర్వాంగములు దాల్చి చనుదెంచునట్లు
సంగళవ్వయుఁదానుఁజనుదేరఁగాంచి - జంగమాకృతిఁగని చని హలాయుధుఁడు

  1. ఒరవోవఁ
  2. యరయఁ
  3. యిల్లు
  4. కంజిపుత్త్రుని నప్డపిల్వ
  5. పాడి
  6. కావున, మఱియు
  7. కోసరింపుచును
  8. పు