పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

బసవపురాణము

శివ! శివ! ఇది యేమి సెప్పెదవయ్య! - శివుఁడేమి నరులభక్షింప రక్కసుఁడె?
శిశువు సద్భక్తుని [1]సిరియాల నంబి - పశువరింపఁగఁజంప భక్తిహీనుండె?
మీ రొడయలుగాన మీమాట బొంకు - నారాదు గాక యేనాఁటఁబోలగునె?”
అని మిథ్య సేయఁగ నా మృడుమూర్తి - "విను హలాయుధ! పురాతనులలోపలను
సతుల నిచ్చినవా రసంఖ్యాతకోట్లు - సుతుల నిచ్చినవారు శతకోటికోట్లు
తమ్ము నిచ్చినవారు దా రనంతంబు - నిమ్మహి లేరన నిది నీకుఁ దగునె?
హరుఁడు భక్తులమనం బరయంగఁదలఁచి - యరుదైన వస్తువు లరుదెంచి వేఁడ
నరగలిగొన కిత్తు రట్ల భక్తులును - ధరఁబుట్టెనే భక్తి సిరియాలుతలనె?
కఱకంఠుఁడును వేఁడెఁగావున నిట్లు - చిరుతొండఁడును బెట్టె సీరాలు బాలు
నరయింపు నమ్మవే ధరణిలోపలను - గరమర్థి నూరూర సిరియాలు చరిత
మేటియై చను భక్తకూటువలందుఁ - బాటలుగాఁ గట్టి పాడెడువారుఁ
బ్రస్తుతోక్తుల గద్యపద్యకావ్యముల - విస్తారముగఁజేసి వినుతించువారు
నటుగాక సాంగభాషాంగక్రియాంగ - పటునాటకంబుల నటియించువారు
మునుమాడి వీరు వా రననేల కూడి - కనుఁగొన ఱోళ్ల రోఁకళ్లఁబాడెదరు
అనుమాన మొక్కింతయును లేదు దీని” – కనవిని కలుషించి యా హలాయుధుఁడు

హలాయుధుఁడు, సిరియాలు కథ విని కోపించి శివునకును, సిరియాలునకును వెలివెట్టుట


“అట్టెట్టు [2]వేఁడె నాహరుఁడు మాంసంబు; పెట్టె[3]నా చిఱుతొండసెట్టితనూజు?
భక్తవత్సలుఁడెట్లు భక్తుని మ్రింగె? - భక్తుఁడేనియు వెట్టు భక్తునిఁజంపె?
హరహరా! యట్టి దేవర యట్టి భక్తుఁ - డరుదగు లేదువో సరిసమానంబు
తల్లి రక్కసియైనఁదా నెట్లుబ్రదికె? - నల్లవో శివుఁడు దానవుఁడయ్యె నయ్య!
ముదిసి ముప్పున నింత మది [4]మరుల్వొంది - మదనారికిని ధృతిమాలంగఁదగునె?
కోమటి బుద్ధుల కోలాసఁ జేసి - కామించి సుతుఁజంపెఁగాక యెట్లన్న
ముట్టరు భక్తులు మున్ను మాంసంబుఁ - బెట్టుదురే తన్నుఁబెద్ద సేయుదురె?
అడిగెఁబో మనసు లోఁతరయఁదప్పేమి? - కొడుకుఁ జంపఁగఁ గత్తిఁగొన్న యంతటనె
మృడుఁడు జాణండేని మెచ్చంగవలదె? - కడుఁగడు మోహించెఁగాక పుత్త్రునకు
మఱి యట్లుగాక యచ్చిఱుతొండఁడరయ - నెఱవణిగల భక్తినిరతుఁడేనియును

  1. జిఱుతొండ
  2. వేఁడెనే
  3. నే
  4. మఱంబొంద