పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

123

పుట్టితిఁగాని యిబ్బువిఁదల్లిదండ్రు - లిట్టివారనియెర్గ నేమనిచెప్ప
నింపార నిమ్మవ్వ యెత్తి చన్నిచ్చి - పెంపఁగఁబెరిఁగితి బిడ్డనిభాతి
నడరఁగెంభావిభోగయ్య సెట్టార్చి - నడపింప భువి నడుగిడఁ గఱచితిని
బడిపను లేమేనిఁబంపుచు నంబి - కడుకొని పిలువంగ నుడువ నేర్చితిని
గడుఁగూర్మిఁ జెన్నయ్యగారిపొత్తునను - దొడుకొని కుడుపంగఁగుడువ నేర్చితిని
అఱకొఱ లేక దాసయ్యమచ్చునను - గఱచితి వస్త్రంబుగట్ట నంతటను
గడఁకతోఁ గూఁతుక్రుమ్ముడిఁ గోసిమాకు - జడఁగట్టె మానకంజారుండు మఱియు
మిండండనై యాడుచుండంగఁ జూచి - వెండి బల్లహుఁ డొక్కవెలఁదిఁగావించె
ఇమ్మిండనికి [1]ధనం బెక్కడిదనుచు - ముమ్మడిపడి సేసె మొన్నయధరుఁడు
అంత దాక్షారామమం దహర్నిశముఁ - గాంతాసుఖోపభోగంబులందుచును
నరుదెంచి మొన్న నా సిరియాలునింట - వరపుత్త్రుఁగంటి దేవరఁగూడుకొనియె
భువిని నా సుఖదుఃఖములు నీకుఁజెప్ప - కెవరికిఁజెప్పుదు నే హలాయుధుఁడ!

జంగమరూపధారియగు శివుఁడు హలాయుధునకు సిరియాలుమహిమఁ జెప్పుట


అట్లునుగాక చోద్యంబు వెండియును - నెట్లన్న వినవయ్య! యేఁజూడఁజూడ
సిరియాలుఁడాకంచిపురి యేడువాడ - లరుదుగాఁగొనిపోవ నందులోపలను
గలసి పుత్త్రుఁడు వోయెఁ గైలాసమునకు నిలఁజిఱుతొండని కెన యెందుఁగలరె?
మలహరుఁడాతనిమనసు లోఁతరయఁ - దలంచి శంకరకింకరులు మొదల్గాఁగఁ
గడఁగి వ్రతస్థులఁ దొడంగి పుత్తేర - నడిగినట్టుల వారి కతిభక్తియుక్తిఁ
జెఱకురసంబు నీప్సితవస్తువులును - నఱలేక యందిచ్చి కఱకంఠుఁగొలువ
నదిగాక హరుఁడరువదియొక్కదినము - వదిగొని కంచిలో వాన [2]గుర్పింపఁ
గడఁగి నిత్యము నేగురొడయల కన్న - మిడుచుండఁదపసులం దెచటలేకున్నఁ
బరముండుదాన తాపసిక్రియ నంత - నరుదెంచి సిరియా[3]లువరపుత్రు నడుఁగఁ
గడునర్థిఁ గొడుకుశాకములు గావించి - మృడుని మెప్పించి యప్పుడు సుతు మగుడఁ
బడసి కైలాస మేర్పడఁజూఱగొనియె - నడరంగ నున్నార మందు నాఁడేము
అట్టి భక్తుఁడు గలఁడయ్య లోకములఁ - బెట్టంగవచ్చునే పుట్టినసుతుని
మచ్చరంబున భక్తిమాటలాడంగ - వచ్చుఁగా”కని పేర్చి [4]హెచ్చి కీర్తింప

  1. వ్రయంబెట్లగున (బిట్లెయ్దద)నుచు
  2. గావింప
  3. పేర్చి