పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

బసవపురాణము

నడిగినఁ జంపితి వడుగఁ దనూజు - మడియించి పిల్చితి మఱి పిల్వదతివ
[1]ఇట్టిట్టిభక్తు లనేకులుండంగ - నెట్టయా [2]సిరియాల! యేనకా కంటి
భక్తితో గర్వించి పలుకుటయెల్ల - యుక్తియే?" యనుచుఁదద్భక్తవత్సలుఁడు
బాలుని నంత సప్రాణుఁ గావించి - కైలాసమున [3]కన్చెఁగమనీయలీల
“జంగమలింగపూజనము వీక్షింప - భంగిఁజతుర్వర్గ ఫలములకంటె
నుతృష్ట”మని ధరనుండె నిమ్మవ్వ - సత్క్రియలందెల్లఁజనునె గర్వోక్తి
యట్టిదకాక యహంకరించినను - బట్టిచ్చునే భక్తి బసవకుమార!
హరుఁడు దా వెండియు [4]నంతఁబోనీక - సిరియాల! రమ్మని చెయివట్టికొనుచు

హలాయుధుని కథ


సరసర భక్తవేషంబులతోడ - ధరహలాయుధుఁడున్నపురికి నేతేర
నా హలాయుధుఁడు నత్యర్థి [5]దుల్కాడ - మాహేశ్వరులకు సమ్మతిఁజాఁగి మ్రొక్కి
నవినయసంభ్రమవివశాత్ముఁడగుచు - నవసరోచిత సత్క్రియాదులఁ దనిపి
ముక్కంటిమూర్తికి ముదము వహింప - మక్కువ సుఖగోష్ఠి మాటలాడుచును
“నెంతదవ్వులనుండి యేఁగుదెంచితిరొ? - యెంతయేనియుఁబథశ్రాంతులు వోలె
నున్నవా”రని యిట్లు విన్నవించుడును - నన్నీలగళమూర్తి యతని కిట్లనియె
“ధరణి మహాభక్తదర్శనార్థంబు - చరియించు జంగమోత్కరములోపలను
నరుదంద ననయంబు నాడుచుండుదుము - కరమర్థి భక్తులే గతియుఁగా మేము
మముఁ దమపాలిలింగముగ వారంత - నమితసంగతిఁ గొనియాడుచుండుదు[6]రు
తిరునీలకంఠుండు వరగొండపతియుఁ - గరికాలచోడండు నరియమరాజు
యెలయదంగుళిమారఁ డేణాధినాథుఁ - డిలఁ జేదిరాజు వాగీశనైనారు
చేరమ శ్వపచయ్యగారు సోమాసి - మారుండు పిళ్లనైనా” రనఁబరగు
వీరాదిగా భక్తవితతిచే నొల్ల - నారాధ[7]నలు గొన్నవార మీ క్రియను
నీడాడ యని చెప్పనేల! యిద్ధరణిఁ - గూడ నేఁజొరనిభక్తులయిండ్లు లేవు
మమ్మెఱుంగనిభక్తుఁ డిమ్మహి లేఁడు - ఇమ్మహిఁబెద్దగాలమ్ము మా[8]సుళువు
మును పెట్టివారు మెచ్చనియట్టి భక్త - జనము లౌననఁగ మా దినములు గడచెఁ
జేపట్టి మము రూపు సేసినవార - లేపారు భక్తుల [9]నేకులు గలరు
నరిది మా బ్రదుకు మున్నాదిఁబుట్టినది - పెరిఁగినది నిరాళపురమను వీడు

  1. ఇట్టి భక్తులనేకు లీ భువినుండ
  2. చిఱుతొండ
  3. కంపెఁ
  4. నంతటఁ బోక
  5. దొల్కాడ
  6. ము?
  7. నములుగొన్నార
  8. సుళువు
  9. యెట్లతాననిన. అ