పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

121

నరసింగ నయనారుని కథ

నరసింగ[1]మొన్నయనారనురాజు - ధరణి మద్భక్తుఁ డాతని యగ్రమహిషి
కరమర్థి నాయూరిపరమేశుఁ గొలువ - నరుగుచోఁ బూజార్హమగుపుష్పమొకటి
పుచ్చి మూర్కొనుడును బువ్వులవడుగు - నచ్చెల్వ నాసికం బప్పుడ కోయ
నచ్చోటి కప్పుడ యచ్చోడనృపతి - వచ్చుడు సతితోడ వనితలు మ్రొక్కి
“దేవ! తప్పేమియుఁ గావింప దిచట - దేవి వోవుచు నొక్కపూవుమూర్కొన్న
లింగార్థమై యున్న చెంగల్వపూవు - నంగన మూర్కొనె నని ముక్కుగోసి
వైచి నీ పూజారివడు” గని చెప్ప - "నోచెల్ల! తగ దిట్టు లుచితమే నీకు”
ననుచుఁ బూవులవడ్గు నప్పుడ విల్వఁ - బనిచి “నీ కిది భక్తిపాటియే వడుగ!
యెట్టివివేకివై తిటమున్ను పువ్వు - ముట్టినచెయి మొట్టమొదటికిఁ గోసి
మఱికదా కోయుట మగువ నాసికము - ఎఱుఁగవు నిన్ను [2]నాకేమనఁ గలదు?
అనుచు నిజాంగన నచటికిఁ బిలువఁ - బనిచి భూపతి [3]వాఁడి [4]బాడితయెత్తి
“నిన్ను నీ వెఱుఁగక యన్నెక్కి క్రొవ్వి - మున్నీశ్వరార్థమై యున్నపూవునకుఁ
జాఁచిన చెయ్యేది సక్కన నపుడు - చాఁచినట్లే చాఁపుదాఁపు ర”మ్మనుచు
ముట్టిన [5]యంగుళుల్ మొదలికి నఱికి - పట్టఁ జూచిన మణికట్టు ఖండించి
[6]తివిచినమోచెయ్యిఁ ద్రెవ్వంగ నడిచి - యవిచారమున మొద[7]లంట వదల్ప
నత్తఱి నేము ప్రత్యక్షమై నిలిచి - తుత్తున్కలై యున్న యత్తన్వి చేయి
మును గోసివైచిన ముక్కును నొసఁగి - జననాథునకు నంత సామీప్యముక్తి
యిచ్చినఁ గైకోఁడె యీ జనవ్రాత - మచ్చెరువందుచు నర్థిఁ గీర్తింప

కొట్టరువు చోడనికథ


అట్టునుగాక [8]మున్ [9]పట్టంబుదేవి - కొట్టరువందు మా కొల్చుఁగుడ్చుచును
గర్భిణినాక తద్గర్భంబులోనె - యర్భకు సహితంబ హరియింపఁదడవ
కోరి మోక్షము వేఁడికొనఁడె మెచ్చినను - నారచోడఁడు! మఱి యట్లనే మెచ్చి
భంగిగా నభిమతఫల మడుగుమనఁ - [10]గింగాణమును జేయ దంగనఁ జూడు
తప్పుసేసిన మహోద్ధతభక్తియుక్తిఁ - దప్పేమి సంపెఁ బో తన్వి దనూజు
నడుగంగవలదె ప్రత్యక్షమైయున్న - యెడ? నింతిమాహాత్మ్య మేమనవచ్చు

  1. మున్నయ
  2. నే నేమనఁ
  3. తాన
  4. బాడి స1ద, -
  5. వ్రేళ్లను; నంగుళులను
  6. తివిరిన
  7. లంతవిడ్పింప
  8. యీ
  9. పట్టంపు
  10. కింగాణి