పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

బసవపురాణము

దన ద్రోహమునఁజేసి తాఁబోయెఁబొలిసి - గొనకొని యా ద్రోహిఁగూడు నే తలఁప"
నన [1]సిరియాలుండు విని యంత శోక - వనధిఁ దేలుచుఁ దలవంచి లజ్జించి
యడఁకుచు నిశ్చేష్టితాత్ముఁడై యుండఁ - బడఁతి నిర్మలభక్తిభాతికి మెచ్చి
యంతకుమున్న నిజాకృతిఁ దాల్చి - యంతకాంతకుఁడు ప్రత్యక్షమై నిలువ
“నోహో! ఇదేమయ్య! యుచితమే యిట్టు - లాహా! మహాత్మ! మహాత్ములగుణమె?
అతిముఱిఁజన్నుఁబాలర్థించి యేడ్చు - చిఱుత[2]చే నొకపిండికరు(ఱు?) డిచ్చి తల్లి
తనచన్ను మఱపించి కొనిపోయినట్లు - చనరాదు నిమ్మిచే సందేహపడకు
మొడలికిఁబ్రాణంబు నొడలువ్రాణమున - కొడఁబడియున్నట్టు లుభయనామములు
నమరెడు లింగజంగమమూర్తి విడిచి - భ్రమకు హేతువులగు భావము ల్దాల్ప
నవ్వరే నిన్నును నన్నును భక్తు - లివ్వేడబంబులకెల్ల లోనైన
నేల యీ బహురూపు [3]లే నేమి నిన్ను - సోల వెల్తిగ మున్ను సూచితినయ్య!
ముక్కంటివై మఱి మూఁడు [4]నుగన్ను - లక్కజంబుగ నున్న నవియు లేకున్న
హరరూపమై యున్న నరరూపమన - గురురూప కాదె సద్గురుసన్నిహితులు
కఱకంఠ! [5]యిట్లేల కళవళించెదవు? - వెఱవకు వెఱవకు వేఱకాఁదలఁప
వేయేల గుండయ్య ప్రాయంబు వడయ - నే[6]యఱ్ఱుకప్పుతో నేఁగితి చెపుమ
భోగయ్య యింటికిఁ [7]బోయిననాఁడు - ఏ గౌరిసహితమై యేఁగితి చెపుమ
దాసయ్యచే వస్త్రదానంబు గొనఁగ - నేసోమకళఁ దాల్చి యేఁగితి చెపుమ
మానకంజారుని మందిరంబునకు - నేనందినెక్కినీ వేఁగితి చెపుమ
చిఱుతొండని యింటికి నీవు - నే చతుర్భుజముల నేఁగితో చెపుమ
కావున నీ చమత్కారము ల్మాను - మీ వేడబము లెల్ల [8]నే మెఱుంగుదుము
ఎట్టైననుండు మీ విట్టారగింపఁ - [9]బెట్టుదు నీయాన ప్రిదిలితినేని”
అనుచు నిష్ఠించి నిమ్మవ్వ పల్కంగ - మనసిజాంతకుఁడు మెల్లన నవ్వుదనర
నట్టైన నవుఁగాక" యని యారగింపఁ - బెట్ట నా [10]సిరియాల సెట్టికిట్లనియెఁ
గడుభక్తిఁ జండేశకాటకోటాదు - లడరంగఁ దండ్రుల నాప్తులఁ దప్ప
నడచినఁ జంపరే? నఱకరే మగుడఁ - బడయరే? వేఁడరే ప్రత్యక్షమైన
విను మట్లుఁగాక ద్రావిడదేశమందుఁ - జనినపురాతన శరణులలోన

  1. జిఱుతొండండు
  2. చేతికిఁబిండి
  3. లేమేని మున్ను, లేవైనమున్ను
  4. ముక్కన్ను
  5. నీవేల
  6. యర్తి
  7. బోయెడి
  8. నే నెఱుంగుదును
  9. బెట్టకనాయాన
  10. చిఱుతొండ