పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

115

యకుటిల వీరవ్రతాచారయుక్త - ప్రకటజంగమలింగ పరతంత్రచిత్త
సంసారరహిత నిష్కళ మహిమావ - తంస సజ్జనసముద్యద్గుణోపేత
హరభక్తులిండ్లకు నర్ఘ్యపణ్యములు - కరమర్థి మోచుచుఁ గాయకం బలరఁ
గొడుకు భక్తులయిండ్లఁ గోవులఁ గావ - నుడుగక కాయకోద్యోగలబ్ధమున
జంగమాసక్తి లసద్భక్తియుక్తి - సంగతి దినములు [1]జరపుచున్నెడను

సిరియాలుని కథ


నంచితమతి సిరియాలుండు నాఁగఁ - గంచిలో నిత్య జంగమము లేవురకు
నిష్టాన్నపానాదులీప్సితార్థములు - దుష్టిగా నందిచ్చుశిష్టవ్రతమునఁ
జరియించుచుండంగ సర్వేశ్వరుండు - సిరియాలు భక్తిలోఁ తరయఁగఁ దలఁచి
కృతక తపోధనాకృతి నేఁగుదేర - హితజంగ[2]మార్థమై యేతెంచి సెట్టి
మస్తకవిన్యస్తహస్తుఁడై తపసిఁ - బ్రస్తుతింపుచుఁ బదాబ్జంబుల కెరఁగి
"స్వామి! వే వేంచేయవే! మహాపురుష! - నీ[3]మనుమని నిత్యనేమంబుసలుప”
నని విన్నవించుడు నత్తపోధనుఁడు - "ననఘ! మాయిచ్చ సేయఁగ నోపుదేని
నింతకంటెను సుఖం బెద్ది మా” కనుచు - సంతసంబందుచు సదయుఁడపోలె
సిరియాలుఁ గరుణాభిషిక్తుఁజేయుచును - నరమాంస మొక్కొక్క వెరవున నడుగ
“సర్వజ్ఞ! మీ మనోజ్ఞంబైనయట్టి - సర్వలక్షణగుణ సంపూర్ణుఁ డొక్క
వరపుత్త్రుఁడున్నాఁడు, నరమాంస మింకఁ - బొరుగింటికిని విల్వఁ బోయెదనయ్య?
అరుదైన మీవ్రతోద్యాపన నేఁడు - కరమర్థిఁ జెల్లింతు క్షణముగొ” మ్మనుచు
నడుగులఁ బడి సిరియాలుండు దపసి - నొడఁ[4]బర్చి యింటికి వడి నేఁగుదెంచి
తన సాధ్వి కొయ్యన తత్కార్యధార - వినిపింప “నీవేల వెఱచెద” వనుచు
సంగళవ్వయు నప్డు చదివెడుపుత్త్రు - మంగళంబలరఁ గ్రమ్మనఁదోడి తెచ్చి
“మనయింటఁ బండువుదినము నే”డనుచుఁ - గనుఁగొని వధ్యశృంగారంబు సేసి
బాలుని ముక్తివిలోలు సిరాలు - లీలయుఁబోలెఁ దల్లియును దండ్రియును
నిండారుమనమున నిహతుఁ గావించి - ఖండించి నానాప్రకారముల్గాఁగ
శాకంబు లొడఁగూర్చి జనులెర్గకుండ - శ్రీకంఠమూర్తిఁ జెచ్చెరఁబిల్చి తెచ్చి
శ్రీపాదయుగళాభిషేకంబు సేసి - యా పాదజలములత్యర్థిఁబ్రాశించి
సంచితోన్నత సుఖాసనమున నునిచి - మించి యర్చించి పూజించి వడ్డించి

  1. సలుపు
  2. మార్థియై
  3. మనమిడి నిత్తెనేమము?
  4. బఱచింటికి