పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

బసవపురాణము

కరుణించి యిచ్చటి కరుగుదెంచితిరొ? - హరహర! మము మఱవరుగదె యెందు?
నిట్టి భయంబును నిట్టినిగర్వ - మిట్టి భక్తియుఁ గల్గునే యితరులకు
బాపురే! దాసయ్య! బడుగులాదరువ ! - బాపురే! దాసయ్య! భక్తులప్రాప!
వచ్చితే [1]యేమేనిఁ దెచ్చితే మాకు; - నిచ్చితే బ్రదుకు మా[2]యీసరయ్యకును
కోకమ్మి పడసినకొలుచు గాదియల - లేకేమి కొనిరావుగాక యేమియును
నేటంపుసంపద లెందేఁగెనింక - మాట [3]లేటికిని రమ్మా పాఱఁగొనుచు
వీసము నాసము విడువంగ ముడువ - నోసరించినధనం బుండునో యిచటఁ
ద్రవ్వుమా!” బనుచు నద్దాసయ్యచేతఁ - ద్రవ్వింప జంగమాస్థానదేశమున
నక్కజంబంద నందంద కడాని - [4]నక్కులై వెడలంగ నక్కజంబంది
యాదాసియును దుగ్గళవ్వయుఁ జాఁగి - పాదాబ్జములమీఁదఁబడి లేవకున్న
“నూలికి మొదలును గూలియు [5]నిచ్చు - నోలికిఁ గొలుచిచ్చి చేలఁగొన్నట్టి
యీగి చెల్లింపక యెట్లునాచేతఁ - జాగెద” వనిపోయి శంభుని నాఁగు
కడుఁగాక యింకొండు [6]దడ(డు?)పల్లియిచ్చి - పడయుము పుట్టెఁడుపందుమునుముక
కుడిచికట్టిన [7]బడుగులచేతనొండెఁ - బడనడ్చికొనుమ యిమ్మడియు ముమ్మడియు
గాదేని పేదల [8]సాదులచేతి - యా దీవనలన మేలయ్యెడిఁబొమ్ము
బడుగుభక్తులకాళ్లపైఁ బడ్డఁగలదె - కుడువఁగఁగట్టఁగ విడువఁగ ముడువ
నేదియుఁ గాదేని పాదము [9]ల్విడువు - లేదన్నఁ బోపునే పేదలమునుక
యిన్నియుఁ జెప్పఁగానేల యీ పసిఁడి – మన్నైనఁ గొనిపొండు గొన్ని పెర్కలను
ననవుడు "నిట్లేల యానతిచ్చెదరు? - త్రినయన [10]యతిగర్వతిమిరాంధు నన్ను
నపరాధశతసహస్రపరీతకృత్యు - నుపమింపరాని గర్వోపేతచిత్తుఁ
గరుణఁ దప్పుల సైఁచి కావవే!” యనుచు - శరణు వేఁడుచును బ్రశంసించుచున్న
సదయాత్ముఁడై యంత శంకరదాసి - ముదమున భక్తసమూహి గీర్తింప
నిరువుర లేవంగనెత్తి కారుణ్య - శరధి నోలార్చి ప్రసాదింపఁ దడవ
అవలఁ దొల్లిటికంటె నతిశయంబగుచుఁ - దవనిధి దేడరదాసయ్య కలరె
గర్వించినను నట్లకాక సద్భక్తి - నిర్వాహమొందంగ నేర్చునే బసవ

మాచయ్య బసవన్నకు నిమ్మవ్వ కథఁ జెప్పుట


అదియును గాక నిమ్మవ్వ యనంగ సదమల - సత్క్రియాస్పద భక్తినిరత

  1. బడగు
  2. యీసురయ్య
  3. లేమిటికి
  4. నక్కులు
  5. నిచ్చి యోలికిఁ
  6. కడువల్లె
  7. బడగుల
  8. సాదల
  9. ల్విడుఁడు
  10. వరగర్వ