పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

107

యట్టి కాయకలబ్ధియందు నిత్యంబు - చట్టన జంగమార్చనలు సల్పుచును
వర్తిల్ల మఱియొక్క వాదంబునందుఁ - గర్త గౌరీశుండ కాఁబ్రతిష్ఠించి
కలునందిఁబుల్లును బులగంబు మేపిఁ, - యిలయెల్ల నెఱుఁగ జొన్నలు లింగముగను
జేసి యో! యనిపించి భాసురభక్తి - వాసనమై నుండ వడినొక్కనాఁడు
ధరణీశుఁ డొక్కఁడు దంత్రంబుఁ దాను - బరమండలంబుల పైఁ బోయి పోయి
బావూరి చేరువఁ బ్రాగ్దిశయందుఁ - బూవుఁదోఁటలచెంత భూపతి విడిసి
యున్నెడ నతనిమహోద్దండగజము - తన్నుఁ దా మఱచి మదగ్రస్త మగుచుఁ
గడిఁదిమావంతునిఁ బడ ఝాళిసేసి - విడివడె దండెల్ల విరియఁద్రోలుచును
నీడకు నులుకుచు నింగివేయుచును - జాడ మల్లార్చుచు జనులఁ జంపుచును
ననివారితోద్వృత్తిఁ జనుదెంచుగజముఁ - గనియు బావూరిబ్రహ్మన లెక్కగొనక
వచ్చుచో మదకరి వడిగొని యెదుర - నుచ్చాటనము సేసి హో [1]యన్చునుదుర
బిట్టుల్కి సంధులు వ్రిదిలి ఘిఱ్ఱనుచు - [2]నెట్టోడి తుండంబు నిటలంబుఁ గూర్చి
వెనువెనుకకు భీతిఁ జని నదీతీర - మునఁ బడి చనలేక మూర్చిల్లి యపుడు
జీవంబు విడుచుడు మావంతు లేఁగి - యా విభునకు నిట్టు లనిరి బెగ్గిలుచు
"విడివడి మదకరి వడిగొని పఱచు - నెడ నొక్కభక్తయ్య యీ పల్లెనుండి
చని పుష్పములు గోసికొని వచ్చునెడను - గని మహోద్రిక్తమై కదియముట్టుడును
గాదన కేతించి కరతలంబార్చి - "చా! దున్న! నిలు” మని జంకింపఁ దడవ
వెనువెనుకకు భీతిఁ జని నదీతీర - మున విడ్చె జీవంబు” నన విని విభుండు
[3]నాయయ్య నాగజం [4]బట్లెంత యేచె - నో” యని [5]వగచుచు నొయ్యన వచ్చి
యమ్మహాత్ముని చరణమ్ముల కెరఁగి - "యిమ్మదకరి నీకు నెదురించుతప్పు
సైరింపు" మని చక్కఁ జాఁగి మ్రొక్కుడును - గారుణ్యరసవార్ధికడలున ముంచి
[6]యమ్మహీజనులెల్ల నాశ్చర్యమంద - బమ్మయ్య మదకరిప్రాణ మట్లిచ్చెఁ
బరగ బ్రహ్మయగారిశరణు సొచ్చుడును - జరితార్థుఁ డయ్యె భూవరుఁడు వెండియును
సజ్జనభక్తులచరితంబు లిట్లు - బిజ్జలక్షోణీశ పెక్కు వర్ణింప
[7]వెరవఱి మార్కొన్నఁ బొరిగొండ్రు వెఱచి - శరణన్నఁ బ్రోతురు హరభక్తవరులు
గాన యిన్నియుఁ జెప్పఁగాఁ బనిలేదు - భూనాథ! మనవలతేని, [8]లే పొదము
కలియుగరుద్రుఁడుగాక మాచయ్య - తలఁపఁగ మర్త్యుఁడే ధరణీశ యిదియ
[9]కర్ణంబు” నావుడు బిజ్జలుఁ డంత - లజ్జయు సిగ్గును బుజ్జగింపగ

  1. యనియడువ
  2. నెట్టాడి, నెట్టొడిసి(?)
  3. నీ
  4. బిట్లింత
  5. వెఱచుచు
  6. యమ్మహా
  7. వెరవిఁడి
  8. పోవుదము
  9. కజ్జంబు