పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiv

బసవపురాణము


డతనికె నెల్లద్రవ్యముల నర్పింప - నతులప్రసాదసౌఖ్యము గల్గు ననుచుఁ
గౌరికి శంభుఁ డీ క్రమ మానతిచ్చె - నీ రీతి నర్పింప నెఱుఁగ రెవ్వారు.
                 * * *
నీ కాయమందును నీ ప్రాణమందు - నీ కరణములందు నిండెడు నెద్ది
యది యనాద్యంతంబు నప్రమేయంబు - సదసదుత్తరము నక్షయము నసాధ్య
పదమనియును జెప్పఁబడు పరశివుని - సదమలకళశిరఃస్థాన మందుండి
యిది యిట్టిదని వచియింప వర్ణింపఁ - గదిసి పేర్కొననశక్యం బెవ్వరికిని
గడుమనోజ్ఞానచింతల కందరాని - దగునిర్మలంబు నిత్యము నిరంజనము
నరసిచూడఁగఁ దాన యత్యంతసూక్ష్మ - తరమగు పరకళ దాన కాదెట్లు
ఈ కళ దాన కాదే గురునాథుఁ - డాకర్షణముఁ జేసి యట లింగమందుఁ
బెట్టి శిష్యుని కరపీఠిక నిలుపఁ - గట్టిగా ప్రాణలింగం బయ్యెఁ దెలియఁ
                *. *. *
అంగంబునను లింగ మధివసించుటను - లింగాంగికంగంబు లేదని తెలిపి
యంగంబు లింగమం దణఁగుటఁ జేసి - లింగాంగములు రెండు లేకుంటఁ దెలిపె
మునుపు లింగము ప్రాణములయందు నెలవు - గోనఁ బ్రాణగుణ మణంగుట నెఱిఁగించె
కళయందుఁ బ్రాణంబుఁ గళ ప్రాణమందు - నీల రెండుఁ గలసియుండెడి కీలుఁ దెలిసె
నది గానఁగళతోడఁ బ్రాణంబుతోడఁ - పొదలిన లింగంబు పూజ్యలింగంబు

-వీ. దీక్షాబోధ 4-5

బసవేశ్వరుని కాలమునందు జైనబౌద్ధమతముల ప్రతిభ తగ్గినది. శ్రీశంకరాచార్యులు వైదికమతప్రతిభను బునరుద్ధరించినను, ప్రజాసామాన్యమునకు నిరుపయోగమయినది. శైవాచార్యులు శివలింగార్చనరూపమున శైవమును గాపాడుచున్నను, శైవమునకు నిస్తేజస్త్వము గలిగినది. ఆళ్వారులు, శ్రీమద్రామానుజాచార్యులు వైష్ణవమతవ్యాపనమునకుఁ బూనుకొనిరి. ప్రాచీనాచారధర్మములు వికలత్వమును బొందినవి. నవీనాచారధర్మములు వ్యాపకమును బడయలేదు. కులభేదములు, జాతిభేదములు, మతాచారభేదములు