పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

95

"ఖగనాథ! శర” ణని ఖగమండలముల - ఖగలింగములఁగొల్చు ఖగసమూహంబు
“నురగేశ శర”ణని యురగాలయముల - నురగలింగములఁగొ(?)ల్చురగసంఘములు
“భృంగేశ శర”ణని భృంగాలయముల - భృంగలింగముల నర్చించు భృంగములు
“జలనాథ! శర”ణని జలజాకరముల - జలలింగములఁగొల్చు జలజాకరములు
"తీర్థేశ శర”ణని తీర్థాలయములఁ - దీర్థలింగముఁ బ్రార్థించుతీర్థములు
“మునినాథ శర"ణని మునిపల్లెలందు - మునిలింగములఁగొల్చు మునిసమూహంబు
“శబరేశ శర”ణని శబరాలయముల - శబరలింగము గొల్చు శబరసంఘములు
నుపమకు మిగిలిన యురువీరఘోర - [1]తపములాపాదించు తాపసవరులు
నిట్టలంబుగమీఁద బుట్టలు వెరిగి - మెట్టల క్రియ నున్న మేటి సన్మునులు
విరచితంబై మీఁద వృక్షముల్ మొలవ - నురువృక్షములభాతి నున్న సన్మునులు
శిలలతోడఁగూడఁ గలయఁగఁ బెరిగి - శిలరూపములభాతి నలరు సన్మునులు
క్తకేశములొడల్ముంచిపైఁ బెరుగ - వ్యక్తనీలాద్రులట్లలరు సన్మునులు
మేదిని దలమోపి [2]మీఁదికి నూర్ధ్వ - పాదులై తపములాపాదించు మునులు
నేకపాదాంగుష్ఠమిలమీఁద మోపి - ప్రాకట [3]తపములాపాదించు మునులు
పంచాగ్నినడుమను బయల దీర్ఘికలు - ముంచి పాఱఁగఁ దపములుసేయు మునులు
జలపత్రవాలుకానిలకందమూల - ఫలశిలాహారులై పరగుసన్మునులు
వృక్షముల్వెట్టంగ భిక్షముల్గుడిచి - యక్షయకాయులై యలరుసన్మునులు
పర్వతంబులు వెట్ట భైక్షముల్గుడిచి - నిర్వికల్పస్థితి నిల్చు సన్మునులు
నొనర జలక్రీడయును వనక్రీడఁ - దనరుచుఁ దనియు గంధర్వదంపతులు
నమితస్వయంభు లింగార్చనాసక్తి - నమరంగ నేతెంచ నమరవర్గములు
జలకన్యకలు నొప్పు బిలకన్యకలును - జలపురుషులు నొప్పు బిలపురుషులును
గరినివహంబులుఁ బురుషమృగములు - శరభశార్దూలాదివరమృగావలులు
గండమృగములు భేరుండ తండములుఁ - జండోరగములు శిఖండి యూథంబు
దొడరి యన్యోన్యశత్రుత్వంబులుడిగి - యడరుచుఁ దమలోన నాడుచు నెపుడుఁ
దనరి యొప్పెడు బిల్వవనమహత్త్వంబు - గని వినుతింపుచు వనమధ్యమందు
వినయస్థుఁడై తన్ను వెదకుచువచ్చు - "ననఘుని మాదిరాజయ్య మనంబుఁ
జూచెదఁగాక” యంచును మల్లికార్జు - నాచార్యుఁ డపరిమితాంగంబుఁ దాల్చి
తెరువున కడ్డమై దివియును భువియుఁ - బరిపూర్ణముగఁ జాఁగఁబడియున్నఁజూచి

  1. తపములఁ జరియించు
  2. మెయికొని యూర్ధ్వ
  3. వ్రతము