పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

93

మొదలికి నఱికిన నదికికొన్తరులు - మొదలికిఁ ద్రుంచిన నదికికొన్ లతలు
వైచినఁ గ్రమ్మఱవచ్చి యచ్చటన - పై చని నెలకొను పాషాణములును
రవితోన యుదయించి దివి దాఁకఁబెరిఁగి- రవితోన దిగ[1]జాఱి భువిఁగూడు గిరులు
నాలుగువాఁకిళ్లు నలిఁగానుపించు - నాలుగుచరుల యానడు మెక్కి చూడఁ
బురములు(ను) గాన్పించు భూరిమహత్త్వ - మరుదగు శ్రీగిరి గిరులన గిరులు
నాలుగువాఁకిళ్లు నలిఁ గానుపించు - నాలుగు [2]కొమ్ముల నడుమెక్కి చూడఁ
బురములు(ను) గాన్పించు భూరిమహత్వ - మరుదగు శ్రీగిరి తరులనఁ దరులు
సంగతంబుగ నెక్కుజనులఁబాతాళ - గంగ నాడించు గంగాశైలములును
సంగతంబుగ నెక్కుజనులఁబాతాళ - గంగ నాడించు గంగావృక్షములును
చని యెక్క నయ్యష్టషష్టితీర్థములు - సనక చూపెడు నష్టషష్టిశైలములు
చని యెక్క నయ్యష్టషష్టితీర్థములు - సనక చూపెడు నష్టషష్టి వృక్షములు
పొరిఁబొరిఁ దమలోన నొరయంగ నగ్ని - దరికొని కాలంగఁ దనరు శైలములు
పొరిఁబొరిఁ దమలోన నొరయంగ నగ్ని - దరికొని కాలంగఁ దనరు వృక్షములు
క్షీరపర్వతములు క్షీరవృక్షములు - క్షీరతటాకముల్ క్షీరదీర్ఘికలు
దధిపర్వతంబులు దధివృక్షములును - దధితటాకంబులు దధిదీర్ఘికలును
ఘృతపర్వతంబులు ఘృతవృక్షములును - ఘృతతటాకంబులు ఘృతదీర్ఘికలును
నమృతపర్వతంబులు నమృతవృక్షములు - నమృతతటాకంబు లమృతదీర్ఘికలు
రసపర్వతంబులు రసవృక్షములును - రసతటాకంబులు రసదీర్ఘికలును
కనకపర్వతములుఁ గనకవృక్షములు - గనకతటాకముల్ గనకదీర్ఘికలుఁ
గనకమృగంబులుఁ గనకోరగములుఁ - గనకభృంగంబులుఁ గనకపక్షులును
గనకంపుగుల్మముల్ గనకంపులతలుఁ - గనకంపురేణువుల్ గనకంపుటిసుముఁ
గనకంపుఁబురములుఁ గనకహర్మ్యములుఁ - గనకంపుఁగోటలుఁ గనకంపుగుళ్లు
మణిపర్వతములు మణివృక్షములును - మణిగుల్మవితతులు మణిలతావళులు
రత్నపర్వతములు రత్నవృక్షములు - రత్నగుల్మంబులు రత్నవల్లరులు
ఒకగొమ్మశోకంబు నొకగొమ్ముసురభి - యొకగొమ్మున్యగ్రోధ మొకగొమ్ముసింత
యొకకొమ్ముగురవంక మొక గొమ్ముగ్రముక - మొకగొమ్ముఘనసార మొకగొమ్మునెఱకు
నొకగొమ్ముసందనం బొకగొమ్ముదిలక - మొకగొమ్ముసంపకం బొకగొమ్ముగ్రోవి
యొకగొమ్ముమందార మొకగొమ్మువకుళ - మొకగొమ్ముమారేడు నొకగొమ్మువొన్న

  1. బెర్గి
  2. కొమ్మల