పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

బసవపురాణము

బహువర్ణవృక్షముల్ బహువర్ణశిలలు - బహువర్ణగుల్మముల్ బహువర్ణలతలు
బహురూపవృక్షముల్ బహురూపశిలలు - బహురూపగుల్మముల్ బహురూపలతలు
ఖేచరవృక్షముల్ ఖేచరగిరులు - ఖేచరగుల్మముల్ ఖేచరలతలు
హర్మ్యపర్వతములు హర్మ్యవృక్షములు - హర్మ్యగుల్మంబులు హర్మ్యవల్లరులు
మృగరూపవృక్షముల్ మృగరూపశిలలు - మృగరూపగుల్మముల్ మృగరూపలతలు
ఖగరూపవృక్షముల్ ఖగరూపశిలలు - ఖగరూపగుల్మముల్ ఖగరూపలతలు
నరరూపవృక్షముల్ నరరూపశిలలు - నరరూపగుల్మముల్ నరరూపలతలు
సురరూపవృక్షముల్ సురరూపశిలలు - సురరూపగుల్మముల్ సురరూపలతలు
సూతవృక్షములు ప్రసూతవృక్షములు - సూతశైలములు ప్రసూతశైలములు
గంధర్వవృక్షముల్ గంధర్వశిలలు - గంధర్వగుల్మముల్ గంధర్వలతలు
నీడలు దిరుగని నిత్యశైలములు - నీడలు దిరుగని నిత్యవృక్షములు
నీడలు లేని సాన్నిధ్యశైలములు - నీడలు లేని సాన్నిధ్యవృక్షములు
దూరంబునను నీడ దోఁచు శైలములు - దూరంబునను నీడ దోఁచు వృక్షములు
ప్రొద్దొక్కపాయయై పొలుచు శైలములు - ప్రొద్దొక్కపాయయై పొలుచు వృక్షములు
తరులును గిరులును దగిలి రమింపఁ - బరగనప్పుడె పుట్టు బాలశైలములు
తరులును గిరులును దగిలి రమింపఁ - బరగ నప్పుడె పుట్టు బాల వృక్షములు
శైలముల్గొలువంగ శైలములెక్కి - లీలనేఁగెడు రాజశైల సంఘంబు
వృక్షముల్గొలువంగ వృక్షములెక్కి - యీ క్షితిఁ జనురాజవృక్ష సంఘంబు
ఎక్కి వీక్షింప నీ రేడులోకములు - నక్కజంబుగఁగాంచునట్టి శైలములు
ఎక్కి వీక్షింప నీ రేడులోకములు - నక్కజంబుగఁగాంచునట్టి వృక్షములు
ఎక్కి [1]యూఁగించిన నెక్కడికైనఁ - జక్కనఁ గొనిపోవఁజాలు శైలములు
ఎక్కి [2]యూఁగించిన నెక్కడికైనఁ - జక్కనఁగొనిపోవఁజాలు వృక్షములు
ఎక్కి తలంచిన నేరూపమైన - గ్రక్కున నప్పుడ కాఁజేయు గిరులు
ఎక్కి తలంచిన నేరూపమైన - గ్రక్కున నప్పుడ కాఁజేయు తరులు
సగము [3]వృక్షంబులు సగము శైలములు -సగము [4]మృగంబులు సగ మండజములు
పండువృక్షములట్ల ప్రబలుశైలములు - గొండలక్రియ గిరికొన్న వృక్షములు
ఒక్కొకగడియ కొక్కొకపండు రాలు - నక్కజంబగు గడియారవృక్షములు
ఒక్కొకగడియ కొక్కొకమాటు చెలఁగు - నక్కజంబగు గడియార శైలములు

  1. యూఁకించిన
  2. యూఁకించిన
  3. మృగంబులు
  4. వృక్షంబులు