పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

బసవపురాణము

యనునివి మొదలుగానందులో మున్ను- ధ్వనియించినట్టి యాదండియల్ దివిచి
తనరుచు మొగచాళమును నవఠాణ - మును మఱి[1]సవఠాణమును దీపు బెరయఁ
దాళపట్టియయుఁ గత్తరి చోళవణియు - లీల సారణయుఁ దలిర్ప సంప్రీతి
నివుడంగ "సకలేశ నిత్యకల్యాణ! - అవధారు ప్రాణనాయక! నాదమూర్తి!
యంచును [2]వాయించు నా రాగమంద - యంచితాళప్తికి నభిముఖుండగుచు
సదమలచిత్తుఁడై సప్తస్వరముల - నుదయించు శ్రుతులిరువది రెండుఁగూర్చి
ఘనతర నారాటకావుళం బనెడు - ధ్వనిగూడఁ [3]జౌదళంబను శారిరమున
[4]ననిబద్ద రూఢమై నాళతిఁ జేసి - తనరెడు గమకసప్తకము సంధిల్ల
మానితంబగు మంద్రమధ్యతారములు - దానొంద లయలంకితంబులు నిగుడ
లాలిత శుద్ధసాళగములు బెరయఁ - గ్రాలుచుఁ దేశిమార్గంబులు వెలయ
లలిద్రుతమధ్య విలంబితంబులను - నలిఁ దాళమాఠమానంబులు సూపి
ధాతులసంగతుల్ జాతులరీతి - భాతిగఁ గూర్చి నిబద్దరూపమున
లాలితంబుగను వైళంబుఁ దాళంబు - సాళి పెళ్ళాపెళ్లి జాయనుజాయి
యుచితమొయ్యారంబునోగిఁబంజళంబు - ఖచరంబు విషమంబు గ్రహమోక్షణంబు
భజవణి [5]రవణియు భరణి [6]మిఠాయి - [7]నిజవణి నివళంబు నిచయవైధసము
నిగితి సుధాయి [8]సన్నిగితంబు మిశ్ర - మగు గ్రహత్రితయంబు నంశుకలలిత
గాఢంబు లలి రాగ కాకును బొచ్చ - గాఢంబు మఱి దేశి కాకును సింధు
నలిఁగరుణాకాకు నఖకర్తరియును - హళువాయియును ధరహరసమవాయి
పరగ గుండాగుండి భ్రమరలీలయును - గురుడి మోడామోడి పొరిరవాళంబు
[9]తీఖ్ఖాయిహొయలును [10]రిఖ్ఖిలవిళగు - చొఖ్ఖాయియాదిగా సొగయు ఠాయములు
దళుకొత్త దేశాక్షి ధన్నాసి దేశి - మలహరి సకలరామక్రియ లలిత
సాళంగ నాట గుజ్జరి మేఘరంజి - వేళా[11]వుళియుఁ జిత్రవేళా[12]పుళియును
మాళవి సిరియు వరాళి కాంభోజి - గౌళపంచకము బంగాళంపు గురిజ
భైరవిద్వయమును బడపంజరంబు - నారంగ గుండక్రియయుఁ గౌశికయును
దేవక్రియయు మధ్యమావతి తోడి - యావసతంబును నాదిగాఁగలుగు
విరచిత స్త్రీ రాగపురుషరాగములు - సరసమై లక్ష్యలక్షణనిర్వికార
పూరితనాదగంభీరవినూత్న - సారోక్తిగీతంబు లారఁబాడుచును

  1. సవరాణము
  2. వాయించె
  3. జోకళం
  4. ననిబంధ
  5. ఠవణియు
  6. విఠాయి
  7. నిజవణావలివణి
  8. సనగితంబు
  9. తిక్కాయి
  10. రిక్కిల
  11. హురి
  12. హురి