పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

89

బృథివి నీ ముగ్ధ(గ్ధు?)ల కథలు దాఁజెప్పఁ - గథలయ్యె' నని కథకథకు నవ్వుచును
నతులితానందసంగతి నున్న భక్త - వితతికి బసవఁడున్నతలీల మ్రొక్కి
“యిప్పురాతనులందు నెఱుఁగరే తొల్లి - యెప్పార నిత్యంబు నొక్క భక్తుండు

కళియంబనాయనారు కథ


నలిరేఁగి కళియంబనయనా[1]రనంగ - నిల మిమ్ము నగియించు నిదియె [2]నేమముగ
మెచ్చించె [3]శివదేవు మీరొక్క మాటి - కిచ్చ నవ్వుట సాలదే నన్ను మనుప”
ననుచు నవ్వించుచు నవిరళభక్తి - జనితసుఖామృతవనధిఁ దేలుచును
బసవఁడు జంగమప్రకరంబునిట్టు - లసలార నోలగంబై యుండిరంత

సకలేశ్వరు మాదిరాజయ్య కథ


“పెద్దలఱేఁడు వెన్నుద్దుల మొదలు - బుద్ధులప్రోక విబుధనిధానంబు
నమితవచోరాశి సుమనోనురాగుఁ - డమలినచిత్తుఁ డుద్యద్గుణాన్వితుఁడు
సకలవీణా ప్రవీణకళావిదుండు - నకలంకనాదవిద్యాపండితుండు
వేదవేదాంతసంపాదితతత్త్వ - వాది సంసారదుర్వ్యాప్తి సంహారి.
యమనియమాదివ్రతాచారవర్తి - శమదమసద్గుణాశ్రయచరిత్రుండు
ధీరమహోదారదిక్పూర్ణ కీర్తి - కారుణ్యమూర్తి నిర్గతసకలార్తి
మహితసజ్జనశిఖామణి నాఁగఁబరగు - మహి సకలేశ్వరమాదిరాజయ్య
గారి సద్భక్తి విఖ్యాపితమహిమ - ధారుణి నెట్లన్నఁ దా విస్మయంబు
నగణితకీర్తిమై నంబెయన్పురము - దగు రాజధానిగా ధరణి యేలుచును
శ్రుతి వీర్య వితరణ రూపవివేక - చతురతరూఢి రాజ్యంబు సేయుచును
జంగమలింగైక్యసద్భక్తియుక్తి - నంగీకరించుచు నర్చలిచ్చుచును
నొడఁబడ రాజవదుపచారములను - గడియగడియదప్పకెడ భజింపుచును
వివిధపుష్పదళ సద్భవనాంతరమున - శివదేవు సంస్తుతిసేయుచున్నంత
రమణ బత్తీసాదిరాగంబులకును - నమరనన్నియు దండియలు నియోగించి
యే రాగ[4]మున సకలేశునకర్థి - యా రాగ వీణ దా నలరి ధ్వనింప
రావణహస్తంబు బ్రహ్మవీణయునున - లావణ్యవీణ కైలాసవీణయును
నాకాశవీణ పినాకివీణయు వి - వేకింప సారంగవీణయుఁ గూర్మ
వీణయు స్వాయంభు వీణయు గౌరి - వీణయుఁగిన్నరవీణయు జనక

  1. రునాఁగ
  2. నీమముగ
  3. శివునట్లు
  4. మా