పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

బసవపురాణము

చెప్పుఁగాలను నూకు శివభక్తిగలదె? - యెప్పాట వినఁబడు [1]నే? [2]యెట్లుసైఁప
వసుధ మృగాదుండు వాఁడు; నేఁ దపసి - నసమానవిగ్రహంబన నెట్లువచ్చు?
[3]నిచ్చటఁ దొల్లియు నేనుంగుతోడఁ - జెచ్చెరఁబోరదే చెలఁది యెట్లనిన
హరుఁడెండఁగాలెడి ననుచు నచ్చెలఁది - పరువడిఁదన నూలు దెరచీరభాతిఁ
దిరిగివచ్చిన వృక్ష తృణగుల్మలతలఁ - బురికొల్పి మీఁదఁగపోతముల్ దీర్చి
కరువుఁ బ్రతిష్టించి గంటయు వేది - విరచించి శిఖరంబుఁగరమొప్ప నిలిపి
ద్వారబంధంబులు దగిన వాకిళ్లు - నారంగ గర్భగృహాదులు దీర్చి
యకలంక కరవీరముకుళప్రభాతి - ప్రకటించి దేహళీబంధంబునందు
రమణీయ శతసహస్రదళాబ్జపంక్తు - లమరు పూజాప్రబంధానేకరచన
గావించి చెలఁది ద్రికాలంబు భక్తి - భావనమై శివుఁబాయక కొలువ
హరుమీఁదఁ జెలఁది మున్నల్లిన నూలు - గరి యంత నేతెంచి కాంచి కోపించి
“పాయకశివుమీఁదఁ[4] బాదొట్రువెట్టి - పోయెడునిది[5] యేమివురు [6]వోకో”యనుచు
ఘనకర్ణ చలిత సంగత మారుతమునఁ - బొనరిన[7]పా దొట్రుఁబోవంగఁ [8]ద్రోచి
వెండి [9]తాఁదెచ్చిన తుండాంతరమున - నిండారుమొగలేటి నిర్మలాంబువుల
[10]నంబికాధవునకు నభిషేకమార్చి - [11]యింబులఁ గుంభస్థలంబుపైఁబెట్టి
తెచ్చినకలువల నచ్చఁ దామరల - నిచ్చలుఁ [12]బూన్చుచు నిటలలోచనునిఁ
గరియును [13]నిట్లు ద్రికాలంబుగొలువ - నరుదెంచి చెలఁది దా నాగ్రహంబంది
“కమనీయలీల నా కట్టినగుడియు - నమరుమదీయ[14] నిత్యార్చనావలియు
నెట్టికర్మియొ చెర్చి యేఁగెడు నింక - నిట్టి శివద్రోహ మెట్టుసైరింతు”
ననుచు నొక్కెడఁబొంచికొనియుండ గజము - సనుదెంచికోపించు చందంబుసూచి
యంతరాంతర మించుకైనఁ దలంప - కంతఁ బరిచ్చేది యై యుపాయమున
దుండాగ్రమునఁ జొచ్చి తొలుచుచుఁ జెలఁది” - దండిమదేభంబు తలకెక్కి చంపెఁ
గాన యిక్కడ నమార్గము సేయుధీర - మానసుఁడెంతవాఁడైనఁగానిమ్ము
అట్లు నేఁడును వాఁడు నరుదెంచెనేని - యెట్లైన జంపక యేఁ బోవననుచు”
వెనుకదిక్కునఁ బొంచికొని సమీపమునఁ - దన పొడసూపక తపసి యున్నెడను

  1. నెట్లుసయంప
  2. యేను; యిట్లు
  3. నిచ్చటనే తొల్లియేనుంగు
  4. పాదుట్రు, పాదుట్ర,
  5. యేటి
  6. నకో
  7. బాదుట్రు
  8. నూకి
  9. మున్
  10. నమ్మహాదేవునక
  11. యిమ్ముల
  12. బూజించి
  13. నట్లత్రి
  14. దివ్యార్చ