పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

బసవపురాణము

'ననుమానమా! త్రావె హరుఁడు విషంబు - బనుగొన నటమీఁదిపను లెఱుంగమన
విని యుల్కిపడి వీపువి[1]ఱిగి “హా! చెడితి' - ననినేలఁబడి [2]పొర్లి యక్కటా! నిన్ను
వెఱ్ఱిఁ జేసిరిగాక! విశ్వేశ [3]యెట్టి - వెఱ్ఱివారైనను విషముఁ ద్రావుదురె?
బ్రదుకుదురె? విషమ్ముపాలైనవార? - లిది యెట్లు వినవచ్చు; నేమి సేయుదును?
నిక్క మెవ్విధమున నిన్నె కానె(కె?)ఱుఁగ - ముక్కంటి! నాకింక దిక్కెవ్వరయ్య?
నా కొఱకైనఁబినాకి! యివ్విషము - చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను
కటకటా! మేన సగంబున నుండి - యెట [4]వోయితవ్వ! నీ వెఱుఁగవే గౌరి!
ప్రమథగణములార! పరమాప్తులార! - సమసిన వెండి మీ శక్యమే కాన?
శతరుద్రులార! యసంఖ్యాతులార! - క్షితిధరకన్యకాపతిఁ గావరయ్య!
వీరభద్రయ్యరో! విషముఁ బ్రాణేశుఁ - డారగించె [5]నిఁ కెట్టులవునోకదయ్య!
ఓ పురాతనులార! యొడయండు బ్రదుక - నోపు[6]నొకో! విషంబొగి నారగించెఁ
జావు దప్పింపరే సద్గురు [7]నాథు - దీవన [8]లీయరే కావరే శివునిఁ
దల్లి లేని ప్రజలఁ దలఁతురే యొరులు - తల్లి యున్న విషముఁ ద్రావనేలిచ్చు!
పరమేశుఁడీ బారి బ్రదికెనేనియును - మరణంబు లేదువో మఱి యెన్నఁటికిని!
నని ప్రలాపింపుచుఁ [9]బనవుచు నొండు - వినఁజాలఁ బ్రాణము ల్విడుతు నే ననుచుఁ
దడయక ఘనజలాంతరమున నుఱుకఁ - బడకుండ నా రుద్రపశుపతిఁ బట్టి
పార్వతీసహితుఁడై ప్రమథరుద్రాది - సర్వసురాసురసంఘంబు గొలువ
హరుఁడు ప్రత్యక్షమై “యడుగుము నీకు - వరమిత్తు నెయ్యది వాంఛింతం” బనుడుఁ
గడుసంభ్రమంబున మృడుపదాబ్జములఁ - బడి రుద్రపశుపతి భట్టారకుండు
“ఏమియు నే నొల్ల నీ విషసేవ - [10]నేమేమి వుట్టునో యే వినఁజాల
గ్రక్కున నుమియవే కాలకూటంబు - నిక్కంబు [11]నాకెక్కె నీయీవి” యనిన
దశనకాంతులు దశదిశలఁ బర్వంగఁ - బశుపతి యా రుద్రపశుపతి కనియె
“ఇట లోకములలోన నెన్ననే కాక - యట మ్రింగ నుమియంగ నది యెంతవెద్ద
యణుమాత్ర [12]నా కంఠమందుఁ జిక్కినది - గణుతింప నున్నదే కాలకూటంబు
యింత సంతాపింప నేల నీ” కనుచు - వింతన వ్వొలయంగ [13]సంతరించుడును
“నమ్మంగఁ జాలఁ బినాకి యివ్విషము - గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను

  1. వీఁగి
  2. పొర లక్కటా!
  3. యిట్టు
  4. పోతివపుడు; పోయితపుడు
  5. ను నెట్టు
  6. నకో
  7. మూర్తి
  8. బడయరే, బొందరే
  9. బనువుచు
  10. నేమియుఁ బు
  11. కిది; కింక
  12. మా
  13. సంతసింపుమన