పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

బసవపురాణము

సకళవ్వ! నీవును సంగళవ్వయును - [1]నొకరీతి నిలువుఁడు సుకరంబుగాఁగ;
బాలరుద్రమ! యెత్తుపట్టఁగ [2]వాళ(సె?) - గ్రోలు వాయింపుము! గుడ్డవ్వ! నీవు
సిట్టితాళము వట్టు శివదేవి! నీవు - సట్టన నృత్యంబు సరసంబెఱింగి;
సంగుదాసమ! మహేశ్వరి! వీర[3]భద్ర - లింగవ్వ! మీరు గేళికలు [4]సేయుండు;
రమణదుకూలాంబరమును [5]గంచుకము - నమరించికొని [6]చల్లడము బిగియించి
యేతెమ్ము నీవు పురాత్మ! శీఘ్ర - మాతతమ్ముగ నృత్యమాడుదు గాని
తాళముల్వట్టుఁడు దాళగింపుండు - నాళతివేళకు నందఱు ననుచు
నవిరళంబుగ [7]నంత నార్భటం బిచ్చి - జవనిక [8]రప్పించి సరసమై నిలిచి
పొలుపగు ముఖరసంబును సౌష్ఠవమ్ము - లలియు భావంబు ధూకళియు [9]ఝంకళియు
మఱియు ఠేవము విభ్రమమును రేఖయును - నెఱయంగ నీ రీతి నృత్యంబు సలుప
లింగార్చనంబు సల్లీలఁ జేయుచును - మంగళారవములు [10]సంగడి నులియ
[11]వెల్ల వేగుడు స్వచిత్తోల్లాస [12]మమర - సల్లీల [13]నమ్ముగ్ధసంగయ్యకిట్టు
లంగన పరిచర్య లాచరింపగ - లింగావసరము సెల్లించు [14]నంతటను
నొగి మనోహరుని పాదోదకసేవ - నగణితలీల దివ్యాంగుండనైతి
నఖిలమాహేశసమగ్రప్రసాద - సుఖసేవ నా కింకఁజొప్పుడునేని
నిలుకాల నిలువంగనేరక తిరుగు - నలమట వాయుఁబొమ్మని తలపోసి
వచ్చినమాడ్కి దివాకరుండంతఁ - జెచ్చెర నుదయాద్రిశిఖరమెక్కుడును
బసవనియాత్మ కింపెసఁగ మిండండు - వెస నేఁగుదెంచి తా వెండి యిట్లనియె
“బసవ! యేమని చెప్ప భర్గుఁడే యెఱుఁగు - నెసఁగ లంజెఱిక మే నీ రాత్రిసేఁత
నీవును మా తోడ రావైతిగాని - వేవునంతకు నొక్క విధమైన సుఖము
ఐనను లంజెర్క మచ్చోటఁ జేయు - చో నిన్నుఁ దలఁచితిఁజుమ్మయ్య బసవ!
పుట్టితిఁగాని మున్నిట్టి సుఖంబు - నిట్టిలంజెఱికంబు నెఱుఁగ నెన్నఁడును
మలహరుకృపలేని మత్తికాండ్రకును - గలుగునే లంజెఱికం [15]15బిట్లు నేయఁ
బగలు రాత్రియు నెడఁ[16]బడక లంజెఱిక - మొగినెన్నియుగము [17]లిట్లొప్పుగఁ జేసి
పడసితి చెప్పుమా పరమేశుచేతఁ - గడునొప్పు లింగజంగమసంపదలను

  1. నొకరితలైనిల్వు, మొకరితలై
  2. వాళ కోలు
  3. భద్రు
  4. సల్పుండు
  5. గచ్చళియు; గంచగళియు
  6. గచ్చడము
  7. నిట్టులావిర్భవించి
  8. ప(పు)ట్టించి
  9. ఝంకంబు
  10. సంగతినొలయ
  11. వెల్లి
  12. మలర
  13. నమ్మిండ
  14. నత్తఱిని
  15. కంబు సేయఁగ
  16. తెగక, తెగకుండ నెన్ని
  17. లొప్పఁగ నిట్లు చేసి