పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

బసవపురాణము

యసలారఁ బడి [1]వేఁడుడంతఁ జాలించి - మసలక బానిస [2]మగిడి యేతెంచి
అక్క [3]యేమందు నీయాన నేనిప్పు - డొక్కసోద్యముఁ గంటి నక్కడి కేఁగి
యట్టి దివ్యాంబరం బఖిలలోకములఁ - బుట్టదు బసవయ్యపట్టంపుదేవి
కట్టినపటవలిపుట్టంబు సూచి - నెట్టణ వచ్చితి నీ కెఱిఁగింప
[4]భావ వేఁడినఁజాలు బసవయ్య యిపుడ - యావస్త్ర మొసఁగెడు [5]నరగలిగొనఁడు
పరగు మహాదేవుభక్తులచేత - నరుదరు దనఁగ [6]గణారాధనములఁ
గొనివచ్చి జంగమకోటి సస్నేహ - మున నిచ్చినట్టి యమూల్యవస్త్రములు
[7]వెంజావళియు జయరంజియు మంచు - పుంజంబు [8]మణిపట్టు భూతిలకంబు
శ్రీ వన్నియయు మహాచీని చీనియును - భావజతిలకంబు పచ్చనిపట్టు
రాయశేఖరమును రాజవల్లభము - [9]వాయుమేఘము గజవాళంబు గండ
[10]వడము గావులు సరిపట్టును హంస - [11]పడియు వీణావళి పల్లడదట్టి
వారణాసియు జీకు వాయుఁ [12]గెందొగరు - గౌరిగనయమును క్షీరోదకంబు
పట్టును రత్నంబుపట్టును సంకు - పట్టును మరకతపట్టు పొంబట్టు
నెఱపట్టు వెలిపట్టు నేత్రంబుపట్టు - మఱి తవరాజంబు మాందోళిరవియుఁ
జంద్రాతపంబును సాంధ్యరాగంబు - నింద్రనీలంబు మహేంద్రభూషణము
సన్ననడంచును శరధియు మేఘ - వన్నెయు రుద్రాక్షవన్నె కాంభోజి
పులిగోరుపట్టును భూపతి రుద్ర - తిలకంబు సరిపట్టు మలయజసిరియు
గొలనిమేఘము గజావళి హయావళియు - వలిపంబు సరి [13]గమ్మితెలుపు దివ్యాంబ
రంబును నుదయరాగంబు దేవాంబ - రంబు పొత్తియు గుజరాష్ట్రంబుపట్టు
మొదలుగా నెఱుఁగమే మును దరతరమ - పదపడి [14]మనవారు వడసినయట్టి
మానితవస్త్రవితానముల్ గలవు - గాని యావస్త్రసమానముల్ గావు
తథ్య మిట్టిద” యని దాసి సెప్పుడును - మిథ్య సేయక వేశ్య మిండనిఁ జూచి
“నలి దలిర్పఁగ [15]నీవు నా[16]తోడి వలపు - గలవేని బసవయ్యకాంత గంగాంబ
కట్టన [17]పుట్టంబుఁ గ్రక్కునఁ దెచ్చి - నెట్టణ నా కిమ్ము నేర్పు దలిర్ప”
ననవుడు "నట్లకా” కనుచు మిండండు - సని కాంచి! బసవ “నీవనిత గంగాంబ

  1. వేఁడుటంతఁ
  2. మగుడి
  3. యేమని చెప్ప నీయాన నిప్పు
  4. బావ
  5. అరుగలి
  6. లింగారా
  7. కెంజావళి
  8. మహి
  9. తాయిమేఘము గజదా
  10. వళము
  11. వళి
  12. గనయము
  13. దమ్మివాలు
  14. దమ
  15. నీకు నా మీఁది
  16. మీఁద - గలదేని
  17. పటవలి పుట్టంబు