పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

55

తృతీయాశ్వాసము

నెఱుఁగునే యలదిగ్గజేంద్రంబుకొదమ - యెఱపంది [1]చను సీక? నెఱుఁగవుగాక
యరుదగు లింగ [2]సదర్థులయిండ్ల - వర(రు?)వుడ నా కొకసరకె యర్థంబు
పుడమీశ మీ ధనంబునకుఁ జే సాఁప - నొడయల కిచ్చితి నొడయలధనము
[3]పాదిగ దఱిఁగిన భక్తుండఁగాను - గాదేని ముడుపు [4]లెక్కలుసూడు” మనుచు
ధట్టుఁడు బసవనదండనాయఁకుఁడు - పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ - నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

నక్కలు గుఱ్ఱములైన కథ


మధుర[5]పాండ్యుడు దన మంత్రిచే నిట్టు - లధికమర్థం బిచ్చి హయముల [6]విలువఁ
బనుచుడు నతఁడు సద్భక్తిపెక్కువను - [7]జనిచని జంగమార్చ[8]న సేయఁ జేయ
నర్థమంతయుఁ బోవ హయముల విలువ - నర్థంబు లేకున్న ననుమాన ముడిగి
పొలమునక్కలనెల్లఁ బిలిచి తెప్పించి - నలిఁ బాండ్యభూనాథునకుఁ [9]బొడసూపఁ
జొక్క నైనారుల మిక్కిలికరుణ - నక్కజం బంద నానక్క లన్నియును
నిలఁ గంకణములతేజలు నయ్యెఁ గాదె - మలహరుభక్తులమహిమ దలంప
నిది సోద్యమే” యంచు నెల్లభక్తులును - సదమలచిత్తులై సంతసం బంద
నతివిస్మయాక్రాంతుఁడై బిజ్జలుఁడు - "ఇతఁ డీశ్వరుఁడకాక యితరుండె?” యనుచు
వర[10]వస్త్ర[11]భూషణావళి సమర్పించి - పరమానురాగుఁడై నరులెల్ల వినఁగ
“బండారిమీఁద నెవ్వండేని [12]యింకఁ - గొండెంబు [13]సెప్పు నా కుక్కలఁ జెండి
నాలుకల్గోసి సున్నము సాలఁబూసి - పోల వేఁచినయిస్ము వోయింతు నోళ్ల”
ననుచు నబ్బసవసింహము వీడుకొల్పఁ - జనుదెంచె నగరికి జనులు నుతింప.

బసవఁడు తన భార్యచీర విప్పించి యొక జంగమున కిచ్చినకథ


వెండియు నొక్కయ్య వేశ్యాలయమున - నుండి బాని[14]సఁ బిల్చి “బండారినగర
[15]మన [16]నిత్యపడి వేఁడికొని వేగరమ్ము" - అనవుడు "నట్లకా” కని పోయి యచటఁ
బడఁతి యబ్బసవయ్య పట్టంపుదేవిఁ - బొడగని కట్టినపుట్టంబు సూచి

  1. చంటికి నేఁగదు
  2. సమర్థుల
  3. పాదికె, పాదిగె
  4. లెక్కకుఁజూడు
  5. పాండ్యుడు
  6. దేరఁ
  7. జనఁజన
  8. నలుసేయుడును, సేయునెడను
  9. దొడుసూప
  10. రత్న
  11. భూషణోత్కరము
  12. మాకు
  13. సెప్పిన చండికుక్కలను; ఇక్కడ యచ్ఛబ్దార్థ మేకవచనమునను దచ్ఛబ్దార్థము బహువచనమునను గలదు.
  14. బానిసె
  15. మున
  16. ఇక్కడ 'నిత్య' అనియే యన్ని వ్రాఁతప్రతులందు నున్నది.