పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

53

“యవికలాజాండతత్త్వాత్మకుఁడైన - శివుఁడు గరస్థలాసీనుఁడై యుండ
సర్వగతుండైన శంభుభక్తునకు - సర్వగతత్వంబు సహజంబ కాదె
సర్వమయుండైన శర్వుభక్తునకు - సర్వమయత్వంబు సహజంబ కాదె
దూరేక్షణంబును దూరశ్రవణము - దూరవిజ్ఞానసిద్ధులు మొద ల్గాఁగ
నణిమాదిసిద్ధులు నభవుభక్తునకు - గణుతింప నెంత శ్లాఘ్యంబు దా” ననుచు
సకలమానవులు మస్తకతటన్యస్త - ముకుళితహస్తులై మ్రొక్కుచునుండ
“నల్లవో”యనుచు భూవల్లభుఁ డతులి - తోల్లాసచిత్తుఁడై యెల్లవస్తువులు
దట్టుఁడు బసవనదండనాయకున - కిట్టలంబుగఁ గట్టనిచ్చె సంప్రీతి
గురుభక్తిశృంగార! గుణగణాధార! వరదయాలంకార! సురుచిరాకార!
ఖ్యాతగంభీర! దుష్కర్మవిదూర ! - గీతమహోదార! ధూతసంసార!
అకుటిలచిత్త ! శివాచారవేత్త ! - ప్రకటతత్త్వాయత్త ! ప్రవిమలవృత్త !
అజ్ఞానజైత్ర! యుదాత్తచరిత్ర! - విజ్ఞానపాత్ర! సంవిత్సుఖామాత్ర!
రూఢవ్రతోత్తుంగ! రుచిరాంతరంగ! - గూఢప్రసాదాంగ! గొబ్బూరిసంగ!
ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ - సంగతసుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగఘనకర[1]స్థలివిశ్వనాథ - వరకృపాంచితకవిత్వ స్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మను కథయందు - ననుపమంబుగ ద్వితీయాశ్వాసమయ్యె.
                                                           * * *

  1. స్థల