పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

బసవపురాణము

నచ్చుగాఁ బ్రాణదేహార్ధముల్ బసవఁ - డిచ్చుచునుండుఁ [1]దా నెల్లభక్తులకు
నా యతమతి బసవా యనఁబరగు - నీ యక్షరత్రయం [2]బిట్లొక్కమాటు
సదువు నాతని ముఖసదనంబు నందె - కదలకుండుదుము మా గణములు నేము
పొదలు నెవ్వని యాత్మ [3]నుదితసద్భక్తి - యదియు బసవని మహత్త్వంబ కాదె
పరికింప నెవ్వఁడు వడయుఁ బ్రసాద - వర[4]ముక్తి యది బసవని కృప గాదె
మదిలోన నెవ్వఁడు మముఁ దలపోయు - నదియెల్ల బసవనియంశంబ కాదె
[5]పసరించు జంగమభక్తి యెవ్వండు - వసుధలో నది బసవనివృత్తి గాదె
భక్తిపట్టము దాల్ప బసవఁడు దక్క - శక్తిసమేతులు [6]జగతిపైఁ గలరె
యదిగాక యొక్క నాయందేల భక్త - హృదయస్థుఁడై [7]చూడ నిట్లున్నవాఁడు
అంచు వెండియుఁ బ్రస్తుతించుచు శంభుఁ - డంచితమతి బసవయ్య కిట్లనియె
“బసవ! మర్యమునందు భక్తులు గలరె? - [8]యెసకమై సంసార మిష్టమే నీకు?”
నని యానతిచ్చుడు నద్దేవు హృదయ - వనజస్థుఁడగు బసవం డిట్టులనియె
“మందునకైనను మర్త్యలోకమున - నిందుశేఖరుభక్తుఁ డెందును లేఁడు
భక్తుండ నేన చూ భక్తులిందఱును - భక్తాత్మ! మీ స్వరూపంబ కావునను
వెండియుఁ గలదొక్క విన్నపంబింకఁ - జండేశవరద! ప్రసన్నత వినుము
జంగమలింగప్రసాదోపభోగ - సంగతసుఖసుధాశరధి నోలాడు
[9]నిటువంటిభవము లెన్నేనియు లెస్స - యిట యపవర్గ మహిష్ఠతకంటెఁ
గావున శునకసూకరక్రిమికీట - కావహజన్మంబులైనఁ గానిమ్ము
సు[10]ప్రసిద్ధము జంగమప్రసాదంబ - యేప్రొద్దు భోగింప [11]నెట్లు గల్గినను
జాలుఁబో భవకోటిశతసంఖ్యలందు - [12]నోలినన్ బుట్టింపు మొకటియు నొల్ల”
ననవుడు గౌరీశుఁ డతిదయాదృష్టిఁ - గనుగొని సిద్ధరామునకుఁ జూపుడును
శివునకు మ్రొక్కుచు సిద్ధరామయ్య - భువికి నేతెంచి యద్భుతము నెక్కొనఁగ
భక్తసమూహికి బసవయ్యమహిమ - వ్యక్తిగాఁ జెప్పంగ నట్ల నేవింటి”
ననవుడు బిజ్జలుఁ “డట్టు లౌటకును - జనులకునెల్ల [13]దృష్టం బిప్పు డిదియ”
యనుచు నమూల్యవస్రాభరణములఁ - బొనరంగఁ [14]గాళవ్వబోయత కొసఁగి

  1. నెల్లెడ భక్తతతికి
  2. బెవ్వఁడేనియును
  3. నొదవు
  4. భక్తి
  5. ప్రసరించు
  6. జగములఁ
  7. కూడ
  8. ఎసఁగు నీ సంసార
  9. నటు... లెన్నైనను మేలు
  10. ప్రసిద్ధగ
  11. నిట్లు
  12. నోలిని.... మొకటినే
  13. దృష్టము గాదె యిదియు, ననుచు
  14. గాటకబోయిని