పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

బసవపురాణము

రప్పించి గొల్లెత రాజు దా నడుగఁ - దప్పక బసవయ్య సెప్పినయట్ల
చెప్పుచు [1]నొఱగినచేతి ఱొంపియును - నప్పుడు జాఱంగ నంటినకాలి
ఱొంపియుఁ జూపి యెఱుంగ[2]రె యితని - పెంపున కిది [3]సెప్పఁ బెద్దయే తొల్లి

తిరుచిట్టంబలుని కథ


ప్రవిమలభక్తి విభ్రాజిత[4]లీల - భువి [5]నఱువాద్దడి మువ్వురిలోన
శ్రీనిలయుఁడు దిరుచిట్టంబలుండు - నా నొక్కభక్తుఁ డనశ్వరకీర్తి
కరమర్థితో వర్షకాలంబునందు - హరపూజనార్థమై [6]యట్లొక్కనాఁడు
చని పుష్పములు గోసికొని వచ్చునెడను - వననిధితీరంబునను గాలు జాఱి
పడి వడిఁ బుష్పముల్ వడకుండ భక్తుఁ - డడరుచుఁ “జిట్టంబలాధీశ” యనుడుఁ
బరముఁడు భక్తునిఁ బడకుండఁ బట్టు - పరుసున ననుఁ బట్టె బసవలింగంబు
వడినట్టులును [7]గాక వసుధేశ వినుము - [8]పుడమిని సొన్నలి [9]పురవరంబునకును
బోయినచోటఁ దత్పురి సుఖగోష్ఠి - నాయతభక్త సభాభ్యంతరమున
సిద్ధరామునిఁ జూచి శివభక్తవితతి - “సిద్ధుండ! లోకప్రసిద్ధంబు గాఁగ
నభినవ శ్రీగిరి యనఁగ నిప్పురము - నభినవలీల సొంపార రచించి
యా పర్వతము మల్లికార్జునదేవు - నేపారఁ గొనివచ్చి యిచ్చట [10]నిలిపి
ధ్రువముగా లక్షయుఁ దొంబదివేలు - శివలింగములను జెచ్చెరఁ బ్రతిష్ఠించి
దానికిఁ దనఁగ మర్త్యములోనియన్న - పానముల్ ముట్టక భక్తిపెంపునను
సహజమకుటము నొసలికన్నుఁ దనర - మహితయోగానందమహనీయలీల
మేనినీడయు భువి మెట్టిన [11]-యజ్జ - గానఁగఁబడ దనఁగాఁ జరింపుచును
నమితసమాధియోగాంతంబునందుఁ - బ్రమథలోకమునకుఁ బన్నుగా నేఁగి
యక్కడఁ దత్త్వరహస్యసద్గోష్ఠి - మక్కువ నెక్కొన మసలి [12]యేతెంతుఁ
[13]బ్రఖ్యాతమిది [14]మాకుఁ బ్రమథలోకమున - నాఖ్యాతసత్కీర్తి [15]యగు బసవాఖ్యుఁ
బొడగంటిరే [16]భక్తభూరిసద్గోష్ఠి - గడు నొప్ప నిక్కడఁ గలుగు నక్కడను
నతఁ డుండు నా విందు మఖిలలోకముల - సతతసాన్నిధ్యానుషక్తిమై” ననిన
శివభక్తతతిఁ జూచి సిద్ధరామయ్య - “ప్రవిమలగతి నేఁడు ప్రమథలోకమున
నరసి వచ్చెద”నంచు నాక్షణంబునను - నరిగి కైలాసనగాగ్రహర్మ్యమున

  1. నూఁగిన
  2. వే
  3. యొక్క
  4. మహిమ
  5. నఱువత్తాది? నఱువత్తాండి
  6. యందొక్క
  7. గాకవిన్ పుడమీశ!
  8. కడయను
  9. కపురంబుకును
  10. నునిచి
  11. యడుగు
  12. యేతెంచు
  13. ప్రఖ్యాతి యిది
  14. మీకు
  15. యట
  16. మీరు