పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

43

“కఱకంఠుగుడి యిదెకంటి మే” మనుచుఁ - [1]బెఱికసెట్లాతనిఁ బిలిచి చూపుడును
నాయతభక్తి “శివాయ నమోన - మో” యని యందంద మ్రొక్కి ముమ్మారు
వలగొని యింటికి వచ్చి కుడ్చుడును - “నిల లింగ మనుచు నిహీ! మల్లభావ
గుంచంబునకు మ్రొక్కి కుడిచెఁ [2]బొట్టారఁ - గుంచంబుఁ గొనిరండు [3]గొలువఁగవలయు
నాఁకటి కక్కఱకైనదె వేల్పు - వేఁకువఁ గుంచంబు వెండియు వలయు”
ననుచు నా శివదేవు నపహసింపంగ - “వినఁ [4]గూడ”దని చేయి వీనులఁ జేర్చి
“చా! కుక్కలార! సాక్షాల్లింగమూర్తి - గాక కుంచమె? [5]యెఱుంగక మొఱం(ఱిం?)గెదురు
నమ్మరే రండు పినాకిఁ జూపెదను - గ్రమ్మన” నని యేఁగఁగాఁ దొంటియెడను
బ్రాకారమును ముఖభద్రమంటపము - శ్రీకరంబుగ స్వర్ణశిఖరంబు గుడియు
విరచితంబై యొప్పు వృషభేంద్రుఁడెదుర - నరయఁ గుంచము లింగ మయ్యె నతండు
నెల్లలోకముల[6]ను బల్లేశుదేవు - మల్లయ్యనా నొప్పె మఱి యట్లుఁగాక

కాటకోటని కథ


కాట[7]కోటఁడు నాఁగఁ గలఁ డొక్కగొల్లఁ- - డేట[8]పెంట్రుక దన కీశ్వరుం డనుచుఁ
బాలెల్లఁ బెంట్రుకపైఁ [9]బోయఁ దండ్రి - గేలి సేయుచువచ్చి కాలఁదన్నుడును
ఖ్యాతసద్భక్తిమైఁ గాటకోటండు - నాతని కలుగుచుఁ జేతిగొడ్డటను
[10]భూతలంబునఁ బడి పొరిఁబొరిడొల్ల - నేతరి వెనుకముందించుక లేక
తల దెగిపడ వ్రేసెఁ దా భవంబనెడు - పులితలఁ దెగవ్రేయుపొలుపు వట్రిల్ల
నిక్కడ నితఁడు దా నిట్లు వ్రేయుటయు - నక్కడఁ గైలాసహర్మ్యకవాట
జాలముల్ గూడ జర్జరితమై [11]పడియెఁ [12]గీలొకో! గొడ్డలి “గైలాసమునకుఁ
గడుఁజోద్య"మని నరుల్ [13]బుడిబుళ్లువోవ - నడరఁబెంట్రుక లింగ మయ్యె [14]నంతటను
బంబిన బావూరి బ్రహ్మయ్యభావ - నంబునఁ గాదె జొన్నలు లింగ మయ్యెఁ
గావున భక్తులభావంబు లింగ - దేవునకును జన్మదేశంబు [15]గాదె
బసవని భక్తిసౌభాగ్యప్రభాతి - యెసకంబు దలపోయ నిది యెంతవెద్ద?
చపలలు శివునిలాంఛనపరు లగుచు - నపవర్గకారణులై రదెట్లనిన:-
నేణాంకధరుభక్తి కెక్కు “ననాద - రేణ శాఠ్యేన” యన్ క్రియఁ దలపోయ

  1. బెఱెక
  2. గడ్పార
  3. కొల్వంగలేదు
  4. గాదనుచుఁ జెయి
  5. కనుకని మొఱింగెదరు
  6. బల్లేశ్వరుదేవ
  7. కోటండనాఁగలఁ
  8. పెంట్రిక
  9. గీటఁ, జిందఁ
  10. ఈ ద్విపద కొన్నిప్రతులలో లేదు
  11. కూలె
  12. కీలకో
  13. బుడిబుళ్లిఁబోవ
  14. వెండియును
  15. గాన