పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

బసవపురాణము

లీనమై ప్రాణంబు లింగమం దొలయఁ - గా నాథుఁ డాప్రాణలీనమై యుండఁ
గా నిరంతరపరమానందసుఖము - నూనిన శివభక్తియుక్తిమార్గమున
వడి “దివారాత్రౌచ వర్జయే” త్తనఁగఁ - బడుసదాంతర్యోగభాతి గైకొలిపి
ఘనబహిరంగశృంగారాంతరంగ - వినుతప్ర[1]మథనసంవిత్సుఖలీల
దివ్యానుభవవార్ధిఁ దేల్ప నబ్బసవఁ - డవ్యయశివతత్త్వ మనువు నెఱిఁగి
యుప్పు [2]ముల్లియ నీర నుంచినయట్లు - గప్పురంబున నగ్గిఁ గప్పినయట్లు
వడగళ్లవర్షంబు వారాశిఁ గురియు - వడుపునఁ దా లేక వర్తింపుచుండెఁ
బ్రభువుచరిత్రంబు భక్తిమై భక్త - సభలందుఁ జదివిన సంప్రీతి విన్న
సరససమంచితసచ్చిదానంద - సురుచిరలింగైక్యసుఖము [3]వట్రిల్లు

వంగకాయలు లింగములైన కథ


వెండియు నొకనాఁడు దండనాయకుఁ డ - ఖండితభక్తివికస్వరలీల
జంగమార్చన సేయుసమయంబునందు - దొంగలు బందివెట్టంగ నూహించి
లింగవంతులు గాని [4]లెంగుల కతని - యంగణాంతరమున కరుగరాదనుచు
వంగకాయలు గట్టుకొంగులఁ బొదివి - లింగసన్నిహితుల భంగి వట్రిల్లఁ
జనుదెంచి యా బసవనదండనాథుఁ - గని భయంపడి మ్రొక్కఁ గన్నుల నవ్వి
“లింగవంతులుగాని లెంగుల కీశ్వ - రాంగణంబున కెట్టు లరుదేరవచ్చు
నింక భక్తుల కాక యీశ్వరార్చనలు - కొంకక చేయుఁడు గూర్చుండుఁ” డనిన
నుల్లముల్ గలఁగ నొండొరులఁ జూచుచును - జల్లన గుండె [5]దిగుల్లన [6]నవయ
భావించి “మన [7]మెట్టు బందిఁ జిక్కితిమి - దేవర గలిగెనా చావు దప్పెడిని
మన కింక నెమ్మెయి [8]మగిడిపోఁ బోల” - దని కృతనిశ్చయులై కూరుచుండి
సరసర మును లింగసహితులపోలెఁ - గరములు [9]సాఁచుడుఁ గట్టుకొంగులను
భంగి నా బసవయ్య భావసంగతిని వంగకాయలు వ్రాణలింగంబు లయ్యె

బల్లేశుమల్లయ్య కథ


అట్టిద కాదె మున్వ్యవహార మేఁగి - నట్టిచో లింగాలయంబు లేకున్న
“సంతతలింగ[10]సంస్పర్శననియమ - మంతరించినఁ జచ్చునటె సెట్టి” యనుచు
గుంచితమతిఁ బూరిగుడి [11]వన్ని యచటఁ - గుంచంబుఁ గొండగోఁగులఁ బూజసేసి

  1. ప్రమోద
  2. ముడియ
  3. వర్థిల్లు
  4. వెంగలు లతని
  5. ధిగిల్లన
  6. నవియ, విరియ
  7. మీడ
  8. మగుడి
  9. సాఁపు; దోఁచు
  10. దర్శనసమయంబు, అం
  11. గట్టియెక్క, కు