పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

41

లింగగంభీరులు లింగకారణులు - లింగవ్రతస్థులు లింగచేతనులు
లింగవినోదులు లింగసంచయులు - లింగావధానులు లింగాత్మసుఖులు
లింగాభిమానులు లింగశాసనులు - లింగసత్ ప్రాణులు లింగతత్పరులు
సర్వశుభోదయుల్ సర్వాధిపతులు - సర్వసంపూర్ణులు సర్వకారణులు
[1]వేయేమి? ప్రమథుల కాయంబు మాకుఁ - గాయంబు గాకొండుగాయంబు గలదె?
ఇందొక్క ప్రమథునియిచ్చ నజాండ - సందోహములు సెడు జనియించు నిలుచు
నదిగాక హరివిరించాది దేవతలఁ - గుదియింతురనుటెల్ల నిది యెంతవెద్ద
తప్పకిందొక్కఁడు ఱెప్పవెట్టుడును - నప్పుడ సర్వసంహార మౌ[2]ననినఁ
గావున వర్ణింపఁగా నగోచరము - భావించి చూడ మా ప్రమథులమహిమ”
యంచుఁ బ్రశంసింప నంబికాదేవి - సంచితమానసాశ్చర్యయై యుండె;
నట్టిపార్వతియు మున్నారగింపంగఁ - బెట్టఁజాలదు విందు విన్నపాపనికి
దేవ! దేవస్తుత్య! దివ్యలింగాంగ - భావనాతీత! సద్భావసన్నిహిత!
శంకర! [3]దురితభయంకర! శౌరి - పంకజ ప్రభవాదికింకరోల్లసిత!
శుభకర! చిన్మయ! జ్యోతిస్స్వరూప! - ప్రభువ! [4]పరాపర! భక్తవత్సలుఁడ
సర్వకల్యాణ! సంసారవిదూర! - సర్వజ్ఞ! జియ్య! సాక్షాత్సంగమేశ!
నెట్టణ నిష్ఠించి నీకారగింపఁ - బెట్ట నాశక్యమే? పృథుదయా[5]భావ!

అల్లమప్రభువు బసవనికి వరములిచ్చుట


యనుచుఁ బ్రశంసింప [6]నల్లమ మెచ్చి - వినుతదయామృతవనధి నోలార్చి
“సురభి చింతామణి సురభూరుహములు - వర(రు?)వులై యుండంగ వర మీగి యెంత
వెద్ద నా” కనుచు సంప్రీతి సిత్తమునఁ - దద్ద సంధిలఁ బ్రసాదము గృప సేసి
తలఁచిన [7]పదపదార్థములు సేకూడ - వలె నన్న వస్తువు లిలఁ [8]దాన పొందఁ
బలికినబాసయుఁ బాటియై తనర - నిలిచినమార్గంబు నిలుకడ గాఁగఁ
బట్టినపదడైనఁ బసిఁడియై వెలుఁగ - ముట్టినబయలైన మూర్తి సేకొనఁగఁ
దెఱలినశివునైన వెఱవక గెలువఁ - దఱిమినజంగమధట్టున కోర్వఁ
జాలు నక్షయలింగసంపద లిచ్చి - లీలఁ దత్త్యార్థసమ్మేళనం బొలయ
మోహమాయాదితమోరాశిఁ ద్రుంచి - దేహేంద్రియాదివిద్వేషం బడంచి
మున్ను దత్త్వస్థితిఁ దన్నుఁ దా నెఱిఁగి - తన్నును సత్క్రియోదాత్తతఁ గూర్చి

  1. వేయేలఁ
  2. ననఁగఁ
  3. యఖిల సంస్తవ! వామదేవ!
  4. పరాత్పర
  5. మూర్తి
  6. నల్లన
  7. యర్థముల్ దద్దఁ జే
  8. దామె