పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

బసవపురాణము

భవ్యకల్పద్రుమఫలపల్లవములు - దివ్యామృతంబునఁ దివుటఁ దాలించి
క్షీరేక్షురసదధిఘృతవార్ధికోట్ల - క్షీరేక్షురసదధిఘృతములు నినిచి
యకలంకరసరసాయనములు గూర్చి - సకలదీర్ఘికల వాసన చేసి [1]కలపి
మఱియుఁ జింతామణిమందిరభిత్తిఁ - దఱిఁదఱిఁ బదపదార్థములు సిత్రించి
సురభిసహస్రసుస్థిరజన్మదేశ - వరదివ్యలోచన వలయువస్తువులు
వెండియు సమకూర్చుచుండంగఁ బ్రమథ - మండలి ప్రమథ[2]కుమారు నొక్కరుని
“యరయుమా యవసరం బయ్యెనొ కాదొ? - గిరిజాలయంబున కరిగి నీ” వనుడు
“నవుఁగాక” యని వచ్చి యంబికఁగాంచి - “యవసరంబే”[3]యని యడుగఁగఁ దడవ;
“ప్రమథుల నిట్టున్నభంగిఁ దోడ్తెమ్ము - ప్రమథకుమార! వేపరువు[4]న” ననుడు
“నొక్కింత [5]వెట్టిన నొగి నారగించి - గ్రక్కునఁ దోడ్తెత్తు గణములనెల్ల
నరుగంగఁ జాల నిట్లాఁకొని” యనుడు - సరసర లింగావసరముఁ జెల్లించి
సొంపార గిరిజ వడ్డింప వడ్డింపఁ - బొంపిరి నోగిరంబులు పదార్థములు
కులపర్వతంబులంతలు గళ్లు సేసి - నలినారగింపంగఁ గలపదార్థములు
నోగిరంబులు సమయుడు వెఱఁగంది - యాగౌరి యత్యద్భుతాక్రాంత యగుచు
“నెన్నంగఁ బ్రమధులకెల్లఁ గావించి - యున్న పదార్థంబు లోగిరంబులును
మానుగాఁ బ్రమథకుమారుఁడొక్కరుఁడ - తా నారగించెఁ జిత్రము సిత్ర! మింక
నేమి సేయుదు” [6]నంచు నీశ్వరుకడకు - హైమవతీదేవి యరుదెంచి మ్రొక్కి
తలవాంచియున్నెడ దరహాసదీప్తి - [7]వెలయంగఁ బ్రమథుల వినుతిసేయుచును
“గౌరి! యిం దొకసిట్టిగణ మిట్టివాఁడు - తోరం[8]బు గణములగౌరవం బెట్టు
లవు "నసంఖ్యాతాస్సహస్రాణి” యనుచు - భువి"సేవ మేతన్నిబోధ[9]త” యనుచుఁ
దొడఁగి వేదములు సంస్తుతిసేయఁబోయి - [10]నడుఁకుచు [11]వడవడ వడఁకెడినేఁడుఁ
గావున ప్రమథు లక్షయు లనపాయు - లావిర్భవన్మహిమాఢ్యు లద్విజులు
నవ్యయు లనుపము లమరు లక్షరులు - దివ్యులు భవ్యులు ద్రిభువనస్తుతులు
సుభగులు సుగుణులు సుమతులు శూరు - లభవు లప్రతిము లత్యానందయుతులు
వేదాంతవేద్యులు విశ్వైకనుతులు - నాదికారణు లణిమాదిసద్గుణులు
లింగాంశు లయ్యాదిలింగసంభవులు - లింగమూర్తులు మహాలింగైకతనులు
లింగాశ్రయులు వ్రాణలింగసంగతులు - లింగసదర్థులు లింగానుభవులు

  1. పట్టి
  2. కుమారుని నొకని
  3. బేమనీ
  4. నావుడును
  5. వెట్టెదే; నెట్టఁదా
  6. నని యీ
  7. వెలుఁగంగ
  8. పు
  9. ధితమ
  10. యడఁకుచు, నడఁకుచు
  11. గడగడ