పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

39

యుభయప్రసాదసంయోగోపభుక్తి - త్రిభువనంబుల నున్నదే యితరులకు”
నని పెక్కుభంగుల నగ్గింపుచుండ - [1]ననుషక్తి నా బసవనకుమారుండు
మిక్కిలిసద్భక్తి మిక్కుటంబుగను - మ్రొక్కుచు నందంద మోడ్పుఁగేలమర
“భక్తవత్సల! [2]పరాపర! పరమాత్మ! - ముక్తివల్లభ! [3]దివ్యమూర్తి! సర్వజ్ఞ!
ప్రభువ! జంగమలింగ! ప్రమథాగ్రగణ్య! - ప్రభువ! సంగయదేవ! పరమానురాగ!
కారుణ్య నిధి! సమగ్రత సూపి నీకు - నారగింపఁగ [4]బెట్టునంత భక్తుఁడనె?

పార్వతి ప్రమథులకు విందువెట్టు కథ


కైలాసమునఁ దొల్లి గఱకంఠుఁ గొలువ - శైలేంద్రకన్యక సనుదెంచునెడను
మారారి యట్ల ప్రమథవర్గమెల్ల - నారంగ సారూప్యధారులై యున్నఁ
బరమేశుఁడెవ్వఁడో ప్రమథు లందెవరొ? - యరుదెంచి యెఱుఁగలేకంబిక నిలువఁ
బార్వతీసందేహభావన యెఱిఁగి - పార్వతీశుఁడు దక్కఁబ్రమథు లక్షణమ
తమతమ తొంటిరూపములు వోవిడిచి - రమణ నొండొండురూపములు వొల్పార
గోమేషవానరకుక్కుటముఖులు - సామజశరభోష్ట్ర శార్దూలముఖులు
మహిషాశ్వసారంగమార్జాలముఖులు - నహికేసరివరాహవిహగాదిముఖులు
ద్విముఖచతుర్ముఖత్రిముఖికముఖులు - నముఖపంచముఖసహస్రాదిముఖులు
లంబోష్ఠలంబాక్షలంబనాసికులు - లంబోదరులు నతిలంబకర్ణులును
గజకర్ణు లజకర్ణు లజితకర్ణులును - విజయఘంటాకర్ణ వీరకర్ణులును
బాహూరుముఖులును బాహూరుతనులు - బాహూరుపాదులు బాహువక్త్రులును
బహుబాహుబహుపాదబహుతాలుజిహ్వ- బహువర్ణబహుకర్ణబహురూపధరులు
నై యున్న ప్రమథగణానేకకోట్ల - నాయంబ గని యద్భుతాక్రాంత యగుచు
నతులితనిజసహజాకృతి నున్న - పతికి మ్రొక్కుచును సంస్తుతిపూర్వకముగ
“విను ప్రమథాధీశ! వీరలందఱును- దన మనోధర్మంబు దారిట్లెఱింగి
కామరూపంబు [5]సక్కఁగఁ దాల్చి రొప్ప - నీమహా[6]గణములకెల్ల నీక్షణమ
పెట్టుదు విందు సంప్రీతిమై భక్తి - పుట్టెడు నంచు విభూతు లిప్పించి
యరిగి మహాకాశ మనియెడిబయలఁ - బరగఁ దత్త్వములను పందిరుల్ వెట్టి
యవికలాజాండంబు లనుభాండములను - వివిధపక్వాన్నాదివితతులు గూర్చి

  1. ననురక్తితోడుత నా బసవండు
  2. పరాత్పర
  3. దయా
  4. బెట్ట నంతశక్తుఁడనె
  5. చక్కనఁ
  6. ప్రమథుల