పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

37

లీలఁ గరస్థలలింగవిన్యస్త - లోలేక్షణానందకేళిఁ దన్మఱచి
యిది యేఱు వల్లంబు నిది సెట్టు గట్టు - నిది దెరు వడవి యన్నది దలంపుడిగి
యరుదేర నన్నియు నంతంతఁ దొలఁగి - తెరువిచ్చుటకు నరు లరుదని పొగడ
బసవని యసమవిభ్రాజితభక్తి - రసవార్ధి వెల్లివిరిసి నిట్టవొడువ
వచ్చెఁ దద్వీచిప్రవర్తితం బగుచు - వచ్చువహిత్రంబువడువు[1]ను బోలె;
నిచ్చ రత్నపరీక్ష యెఱిఁగి చేపట్టు - బచ్చునుబోలె నబ్బసవయ్య ప్రభువు
భావంబు సంగయదేవునియంద - భావనఁ బొరయుడు భక్తిమై మ్రొక్క
రుచిరరత్నప్రభానిచితమై యున్న - యచలితస్వర్ణసింహాసనం బెక్కి
ప్రభువున్న; నంగప్రభాపటలంబు - లభినుతిఁ బొందె దిశాంతరాళముల
నొడల జీవము గల్గియును లేనివాని - నడగల్గియును వర్తనము లేనివానిఁ
గన్నులు [2]వ్రేఁగులుగాఁ గలవాని - మున్ను లింగమ ప్రాణముగ నున్నవానిఁ
జేతనుండయ్యు నిశ్చేష్టలవాని - ఖ్యాతి లేకయు నుతిఁ గడచన్నవాని
బలుకుల మీఱినబాసలవానిఁ - దలఁపులదాఁటిన తత్త్వంబువాని
గుణహీనుఁ డయ్యును గుణమిచ్చువాని - బ్రణవాత్ముఁ డయ్యు నేర్పడియుండువానిఁ
గని శరణనుచు గద్గదకంఠుఁడగుచుఁ - గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
బసవఁ డల్లంతటఁ బ్రణమితుం డగుచుఁ - నసలార సముచితాభ్యర్చితుఁ జేసి
లింగతూర్యములు సెలంగ నుప్పొంగి - మంగళారతులెత్తె మహిఁ దత్‌క్షణంబ

అల్లమప్రభునికి విందువెట్టుట


పల్లెరం బిడి పంచభక్ష్యాన్నములును - నెల్లపదార్థముల్ దెల్లంబు గాఁగ
వడ్డించి యబ్బసవండర్థి దొడ్డ - దొడ్డకళ్లుగఁ జేసి తొడిఁ [3]దొడిఁబట్టి
హరునకుఁ దొల్లి యా సురియచౌడరసు - కరమర్థి [4]నందిచ్చు కరణియుఁబోలె
[5]నందిచ్చుచుండంగ నర్థిఁ జేసేత - నందికొంచును బ్రభు వారగింపంగ
బంబి లక్షయు నెను(c?) బదివేలు జంగ - మంబులకనుచు సమగ్రత దనర
నటమున్న చేసినయప్పదార్థంబు - లిటుగూడ సమయుడు [6]నెట్లొకో యనక
యేనకాకోగిరం బింక నీ కనుచుఁ - బూని యూఁకింపఁ బ్రభువు మెచ్చి యంతఁ
“గో”యని భక్తనికాయంబు వొగడ - "హో”యని సత్కృపాయుక్తి వొల్పార
“బాపురే! బసవ! సద్భక్తసంత్రాణ! - బాపురే! బసవ! సద్భక్తిధురీణ!

  1. వడువునుబోలె, ఇట్టి ప్రయోగములు నన్నిచోడని కుమారసంభవమునఁ గూడఁగలవు.
  2. వ్రేగులు, వేవేలుగాఁగను
  3. బడిపట్టి
  4. నందించు
  5. నందించు
  6. నెట్లకో