పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

31

“సకలసామ్రాజ్యపూజ్యస్థితికెల్లఁ - [1]బ్రకటింపఁగా నీవ పతివట్లుఁగాక
నా యర్థమునకుఁ బ్రాణమునకుఁ బతివి - వేయును నేల? నీవే [2]నేను బసవ!
నిన్ను నమ్మితి” నంచు నెయ్యమెలర్ప- మన్నన బిజ్జలక్ష్మాధీశుఁ డనిన
“సకలలోకైకరక్షకుఁడగు శివున - కొక నిన్ను [3]రక్షించుటకు నెంతవెద్ద
కావున మాలింగ దేవుభక్తులకు - [4]నేవేళ వెఱచుండు మింతెయె చాలు
నీ రాజ్య మేలించుటిది యెంతవెద్ద - నీరధి మేరగా నిన్ను నేలింతు”
నని యూఱడిల బసవనదండనాథుఁ - డనుకూలుఁడై పల్క నంత బిజ్జలుఁడు
మఱియుఁ గట్టఁగనిచ్చి మహనీయలీలఁ - గొఱలునెయ్యమున వీడ్కొలిపె; వీడ్కొలుప;
గా బసవఁడు భక్తగణములు దాను - నా బలదేవనాయకుని నగళ్లు
తనకు నిజాలయస్థానమై యుండఁ - దననియోగము గొల్వఁ దాఁ జనుదెంచి
లాలితలింగకేళీ[5]లసన్మతిని - లీలానుకూల [6]సచ్ఛీలసంపదల
ననుదినవర్ధమానైశ్వర్యుఁ డగుచు - జనపతిరాజ్యంబుఁ జక్కవెట్టుచును
దెసలెల్ల సత్కీర్తిఁ బసరించుచున్న - బసవనిపూనిక బాసయెట్లన్న

బసవేశ్వరుని బాస


శివరాత్రి నిత్యంబు చెల్లించు బాస - శివభక్తులెల్లను శివుఁడను బాస
భక్తుల యెగ్గులు పట్టని బాస - భక్తులకుల మెత్తిపలుకని బాస
మృడునైన నొకమఱి యడుగని బాస - యడిగిన యర్థంబు [7]గడపని బాస
చీమంతయైన వంచింపని బాస - యేమి వేఁడిన నడుగిడకిచ్చు బాస
తలఁపెట్టులట్టుల పలికెడు బాస - పలుకట్ల నడవడిఁ బాలించు బాస
పలికి బొంకనిబాస వొలివోని బాస - చలమెడపని బాస సలిపెడి బాస
తప్పఁ దొక్కనిబాస [8]దరలని బాస - యెప్పుడు భృత్యత్వ మెడపని బాస
కలనైన శివునకు గెలుపీని బాస - గెలుపు భక్తుల కిచ్చి కీడ్పడు బాస
పరసతిపై దృష్టి వఱపని బాస పరధనంబుల కాసపడకుండు బాస
పరనింద నెయ్యెడఁ బొరయని బాస - పరమర్మకర్మముల్ వలుకని బాస
పరసమయంబులఁ [9]బరిమార్చు బాస - పరవాదులను బట్టి భంజించు బాస
హరదూషణకుఁ జెవులానని బాస - హరగణానర్పితం బంటని బాస

  1. బ్రకటంబుగా
  2. మన్పు
  3. రక్షింపనొండెంత వ్రేఁగు
  4. ఏవలనెఱచుచుం డింతియ చాలు
  5. కేళీలోలమతిని
  6. సుశీల
  7. లెడపని
  8. తరగని
  9. బొరిమాల్చు