పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvi



జింతించి తెలియును స్థిరమౌట నీవు - అంతన పాయు నీ కాణవమలము.

- వీరశైవదీక్షాబోధ 32-పుట.

మాయామలంబు తొలంగుటకుఁ గులభ్రాంతిని, స్త్రీపురుషభ్రాంతిని విడిచి, సర్వత్ర ఆత్మసందర్శనంబును జేయవలయును.

శిలలోపలఁ జనించిన నేమి పసిడి - శిలయుఁ దా నగునయ్య! చింతింప నట్ల
మానవులందు సంభవులైన నేమి - మానవు లగుదురె మా భక్తవరులు
పూరుషులైన నపుంసకులైన - నారులైనను బ్రాహ్మణకులీనులయినఁ
జండాలులైనను శంభుఁ బూజింప - నొండేమి రుద్రసామ్యులు విచారింప
నదిగాక నీవు నీ యాత్మను గాంచి - వదలకుండినఁ గులవ్యామోహ ముడుగుఁ
మఱి దానె తొలఁగు నీమాయామలంబు - తొరలు నహంకృతి దోడ్తన యడఁగు.

- వీరశైవదీక్షాబోద 39-పుట.

కార్మికమలమును బోనాడుటకు యథాలాభసంతుష్ఠుఁ డగుచు, తన సంపదలను గురులింగజంగమములకు సమర్పించి వారి తీర్థప్రసాదములను స్వీకరింపవలయును.

ప్రాణేశ్వరునకుఁ బ్రాణార్థంబు లొసఁగు - జాణవై ధన మిమ్ము సద్భక్తులకును
వినుము వెండియు నొక్కవిత్తమేకాదు - తనుమనోధనములు దగఁగురులింగ
జంగమావలి వినిశ్చయ మెట్టులనిన - సంగతలింగదీక్షాకాలములను
త్రివిధమూర్తులకును శ్రీగురుస్వామి - త్రివిధ మిమ్మనియె నా త్రివిధ మెట్లనిన
తను వెప్పుడును గురూత్తమునకు మనముఁ - దనరలింగమునకు ధనము భక్తులకు ఘనమనోవాక్కాయకర్మసత్క్రియలఁ - దన గురునియనుజ్ఞఁ దప్ప కిచ్చినను
ఘనములకెల్లను ఘనమైనలింగ - మును శ్రీగురుండును ముదమార నిచ్చు
నటుగాక దీక్ష నీ వాసించినపుడు - తటుకునఁ దను మనోధనముఁ ద్రిమూర్తు
లకు సమర్పింప వాలాయంబుగాన - నొకటియు నీది గాకుండుటఁ దెలసి
త్రివిధమూర్తులకును ద్రివిధవస్తువుల - నవిరళప్రీతి నీ వర్పించి తేనిఁ
బట్టించు సద్భక్తిభావ మంతటను - గట్టిగాఁ దొలఁగు నీ కార్మిక మలము.

- వీరశైవదీక్షాబోధ 42-పుట

ఆణవమలమును, మాయామలమును, కార్మికమలమును బాసిన సాధకుఁడు ధర్మప్రవర్తకుఁడై, శ్రీగురుకటాక్షమునకుఁ బాత్రుఁడై, లింగధారణరూపమైన చిన్మయదీక్షను బొంది శివస్వరూపుఁ డగుచున్నాఁడు.