పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

బసవపురాణము

బసవ నామంబిడి పతియును సతియు - నెసక మెక్కఁగ నున్న యెడఁ గుమారుండు
వెనుకఁజీకటి యుండఁదన కేటితేజ - మనుగతి దీపంబుఁగనుఁగొని నవ్వు
సన్నుతలింగప్రసాదమగ్నతన - యున్నట్లు చనుగుడ్చు [1]నూరక యుండు
శివసుఖామృతమును జేఁగ్రుమ్మరించి - చని [2]సూచుమాడ్కి హస్తములారగించు
శివపదధ్యాననిశ్చేష్టితావస్థఁ - దవులుచందంబునఁ దా వెఱఁగందు
బిలిబిలి సంసారమిలఁ [3]బాఱఁదోలి - [4]చెలఁగి యాడెడుగతిఁజేతులాడించు
మాయాప్రపంచంబు దాయంగనీక - పాయఁదన్నెడు రీతిఁబాదంబులార్చు
వడి మెయిఁదన పూనివచ్చినపనులు - దడవయ్యె ననుచు నుల్కెడుభంగి నులుకు
భవుఁ [5]బాడ నానందబాష్పంబు లొలుకు - పవిది నేడుచుఁగనుఁగవ నశ్రులొలుక
భవబాధలకు నగపడి మొఱవెట్టు - భవులకుయ్యాలించుభాతి నాలించు
నొడయలయడుగులఁ [6]బడి మొఱల్వెట్టు - వడువునఁ బుడమిపైఁ బడి బోరగిల్లు
నిల [7]మఱపడ్డ నిర్మలశివభక్తి - తలయెత్తువడువునఁ దాఁ దలయెత్తు
నరుదొందఁ బద్మాసనాసీనవృత్తిఁ - బొరి నభ్యసించుపొల్పునఁ గూరుచుండుఁ
బూని ద్వితీయశంభుండను నంది - నే నను భావన నిలఁ [8]దోఁగియాడు
నా వీరమాహేశ్వరాచార మెల్లఁ - బ్రోవయి నిల్చినపోల్కి నిల్చుండుఁ
గడఁకతో నాది మార్గము దప్పకుండ - నడుగిడులీలఁ [9]దప్పడుగులు వెట్టు
మలహరుఁ బేర్కొనుమాత్ర గద్గదము - లలరుకైవడి [10]దొక్కుఁబలుకులు పలుకు
బల్లిదు ల్మాశివభక్తులే యనుచుఁ - గ్రేళ్లువాఱుచు నాడుక్రియఁబాఱి యాడు
నంత [11]వినోదంపుటాటప్రాయమున - సంతతంబును శివార్చన మాచరించు
బుద్ధు లెఱుంగు లేఁబురులుప్రాయమున - సిద్ధంబు భక్తుల శివునిగాఁ దలఁచు
సర్వజ్ఞుఁడైన వృషభమూర్తిగాన - సర్వవిద్యలు సహజంబపాటిల్ల
గతభక్తియుక్తుఁడై గర్భాష్టమమున - సుతునుపనయనంబు శుభముహూర్తమునఁ
జేయుదునని తద్దఁ జిడిముడిపడఁగ, - నా యెడ బసవఁడిట్లని దండ్రికిని:-

బసవేశ్వరుఁడు వడుగు వలదని తండ్రితో వాదించుట


"వడుగని యిది యేమి గడియించె దీవు - జడుఁడ వెట్లయితివీశ్వరునిఁ గొల్చియును
బరమాత్ముగురునిగాఁ బడసి దుర్నరుల - గురులని తలఁచుట నరకంబు గాదె?

  1. చూరక
  2. యాను
  3. గూల, దూల
  4. చెలఁగి యాడుగతిఁ జేతులు విచ్చి యాడు
  5. జూడ
  6. బడమొదల్వెట్టు
  7. మర్వు(ఱు)
  8. దొంగి
  9. దట్టడుగులు(?)
  10. ద్రొక్కు
  11. వినోదంబులాట