పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

బసవపురాణము

దగిలి శివధ్యానతత్పరత్వమున - మొగిఁదల్లికడుపులో [1]మూఁడేఁడులున్న
సుతభరాక్రాంతయై మతి శ్రమంబంది - సతి దొంటి నందికేశ్వరుగుడికేఁగి
“నోములు గీములు వేములఁగలిపి - నీ మర్వుసొచ్చితి [2]నిఖిలలోకేశ
మఱుఁగుసొచ్చినయట్ల మన్నించి నన్ను - మెఱయింపు సుతునీగి మేలయ్యె నేఁడు
పున్నెంబు సేసిన పొలఁతు[3]లు నెలల - నెన్నఁ దొమ్మిది మోచి కున్నలం గండ్రు
అల్లన మూఁడేఁడులయ్యె [4]నన్నింత - [5]యల్లటపెట్టెదో[6]యన్న! నే నెఱుఁగ
దుర్భరంబైన యీయర్భకు [7]వలని - గర్భంబు కర్కటిగర్భంబు వోలె
నరయంగ నీయిచ్చు [8]వరములు సాలు [9]నెర(రి?)వు మాన్పింపవే యేమియు నొల్ల
నన్నెంత కెత్తుకోనున్నదో కాక - యెన్నఁడు విందుమే యిట్టిగర్భముల!"
ననుచుఁ దా నచ్చోట నచ్చోట నిలిచి - తనువు శ్రమంపడఁదనయింటి కరిగి
పాన్పుపై [10]నుస్సని పరితాపమంది - తన్పుగా నార్ద్రచందనవారిఁదోఁగి
నెవమునఁ గనుమూసి నిద్రఁ [11]బొందుడును - సువిదకుఁగలవోలె నుక్షవల్లభుఁడు
జంగమలింగవేషంబొప్పఁదాల్చి - యంగన [12]కిట్లని యానతి యిచ్చె
“నీ మనస్తాపంబు నీవగ మాన్పఁ - గా [13]మించి వచ్చితిఁగమలాయతాక్షి!
“నీ కడ్పులో నున్న యాకుమారుండు - లోకపావనమూర్తిగాక కేవలుండె?
యాదివృషభము శిలాదునికొడుక; - యాదేవదేవుని యానతిఁజేసి
భక్తహితార్ధమై ప్రభవించు నీకు - వ్యక్తిగాఁ జెప్పితి వగవకుమింకఁ
బుట్టెడుఁ బుత్రుండు; పుట్టఁగఁదడవ - పెట్టుమా బసవఁడ న్పేరు పెంపార”
నని యానతిచ్చిన నంత మేల్కాంచి - కనువిచ్చి [14]చూచుచుఁగాన కెవ్వరిని
“ఈతఁడు మన నందికేశుండు దాన - [15]యేతెంచెఁ గానోపు నింతయు నిజము
బ్రదికితి; నా జన్మఫలమెల్ల నేఁడు - తుదముట్టె" ననుచు సంతోషాబ్ధిఁదేలి
చెలులుఁ జుట్టములు నచ్చెరువంది వినఁగఁ - గల తెఱఁగంతయుఁ [16]గడువేడ్కఁ దెలిపి
యున్నెడఁ గోమలియుదరంబులోన - నున్న మహాత్మునిహృన్నలినంబు
దానయై వెలిఁగెడు తత్పరంజ్యోతి - వానిఁ బ్రబోధించి “వచ్చినపనులు
మఱచితే” యనవుడునెఱిఁగి సద్భక్తి [17]యఱ(ఱు?)కువ గాకుండ సాష్టాంగమెఱఁగి

  1. మూఁడేండ్లు మున్న
  2. నిఖిలంబు నెఱుఁగ
  3. తుకలెల్ల
  4. నన్నెంత
  5. యల్లడ
  6. యయ్య!
  7. వలన
  8. వరము పాలొడలి
  9. యెర(రి)పు
  10. నుహ్హని
  11. జెందంగ
  12. కప్పు డిట్లానతియిచ్చె
  13. ముందె; మదె
  14. చూచుడుఁ
  15. యేతెంచెఁ గాఁబోలు
  16. దెలియఁ జెప్పుచును
  17. యఱయు లేకుండంగ