పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

బసవపురాణము

మీ శుద్ధచారిత్ర మీ పుణ్యగోత్ర - మీ శుభాంచితమూర్తి యీ లసత్కీర్తి
యేరికిఁగల్గునే యెన్నిభంగులను - గారవింపఁగ నీవు గానివారలకు
నిన్ను [1]ధరింపంగ నీకె కాకొరుల - కెన్నంగ శక్యమే యీశ! [2]సర్వేశ!
అట్టిద కాక నీ యంశంబు గాని - యట్టివాఁడింత నీ [3]కనుగులం బగునె!”
యనుచున్న గిరిరాజతనయ వాక్యములు - విని ముదితాత్ముఁడై విశ్వేశ్వరుండు
నారదుదెసఁజూచి "నందికేశ్వరుని - గౌరవమహిమ విఖ్యాతిని వింటె”
యనుచు నానందీశు నధికదయార్ద్ర - వనధిఁ [4]దేల్చుచుఁ గనుఁగొనుచున్న యెడను
నెంతయు భయము నొక్కింతయుఁజూపు - నెంతయు సిగ్గు నొక్కింతయు ముదముఁ
దనకు భూషణములై తనరారుచుండ - గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
సులభరోమాంచకంచుకితాంగుఁ డగుచు - దలఁపున డెందంబు దటతట [5]నదర
మస్తకవిన్యస్తహస్తుఁడై తన్నుఁ - బ్రస్తుతింపుచు నున్నప్రభు నందికేశుఁ
గనుసన్నఁ జేసన్నఁ గదియంగఁ బిలిచి - తన నిర్మలప్రసాదముఁగృపచేసి
నెయ్యంబుఁగరుణయు నిండి వెల్విరియ - నయ్యంబికాధవుఁడతనికిట్లనియె.

శివుఁడు నందికేశ్వరుని మర్త్యమున బసవేశ్వరుఁడుగా జనింపఁ బంపుట


“ఇది శ్రుతిస్మృతిమూలమిది ధర్మశీల - మిది విమలాచార మిది [6]తత్త్వసార
మిది సుమహత్త(హాత)త్వమిది కృతార్థత్వ - మిది యాదిపథమని విదితంబుగాఁగ
నీ కతంబునన నిర్ణీతమై భక్తి - లోకంబునందవలోకింపఁబడియెఁ
బ్రమథాధిపతులకుఁ బార్వతీసతికి - విమలమదీయతత్త్వముఁ బ్రబోధించు
తెఱఁగునకంటెను దెల్లంబుగాఁగ - నెఱిఁగించితిమి [7]నీకు నెక్కుడుఁ గూర్మి
నట్టిద; సర్వజ్ఞుఁ డనుపేరు నీకు - [8]నిట్టట్టునా వలదెల్లచోఁజెల్లుఁ
గాన యామర్త్యలోకమ్మున కరిగి - పూని ద్వితీయశంభుండన మహిమ
వ్యక్తిగా లోకహితార్థంబు సకల - భక్తహితార్థంబు పరమార్థముగను
మా వినోదార్థంబు మర్త్యంబుఁ బరమ - పావనంబుగఁ జేయు బసవఁడన్పేర”
నావుడుఁ [9]గేల్మోడ్చి నందికేశ్వరుఁడు - దా విన్నపము చేసె దేవదేవునకు
“మీ యాజ్ఞఁదలమోచి [10]మెయికొని పనులు - సేయుదు నన్నింత సెప్పంగనేల?
[11]మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడు - గర్త యున్నాఁడె లోకత్రయవరద!

  1. భరింపంగ
  2. మహేశ
  3. కనుగలం
  4. ముంచుచు
  5. నుదర
  6. ధర్మ, పుణ్య
  7. నీక యెక్కుడుఁ
  8. నిట్టట్టనా
  9. గేల్మొగ్చి
  10. మేదినిఁబ
  11. ఇట్టిప్రాసముల నీ కవి పెక్కుచోట్లఁ బెట్టియున్నాఁడు.