పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

11

నతఁడంతరంగంబునందు నన్ గాంచు - గత దేటతెల్లయై కానవచ్చుటయు
నప్పుడచ్చెరువుఁబ్రహర్షంబు భక్తి - ముప్పిరి గొని మనంబున నుల్లసిల్ల
సాష్టాంగమెఱఁగి మదంఘ్రికంజములు- హృష్ణుఁడైనెన్నుదురిఱయంగ మ్రొక్కి
యానంద బాష్పపూర్ణాస్యుఁడై కలయ- మేనురోమాంచ సమ్మిళితమై తనర
గద్గదకంఠుఁడై కరములు మొగిచి- తద్గతచిత్తుడై తాఁబ్రస్తుతింప
“మెచ్చితి వరము నీ కిచ్చితి వేఁడు - మిచ్చ యెయ్యది నందికేశ్వర!” యనిన
దరహాస[1]కాంతి వక్త్రమునఁ [2]దుల్కాడ - నరుదొంద మాకు నిట్లని విన్నవించెఁ
“బెన్నిధి యుండగమన్నడుగుదురె? - ని న్నొండు వేఁడెడు [3]నిర్గుణి గలఁడె?
పదవులు గిదవులు పనిలేదు నీదు- సదమలభక్తిఁ బ్రసాదింపు [4]దేవ?”
యనిన గాఢాలింగనావలి నతని- తనువు నా తనువునఁ బెనఁగొల్పి యంత
“భవదీయగాత్ర సంస్పర్శన సుఖము - నవక మెక్కఁగ వాహనం బగు మిట్లు
ఆది మదీయవాహనమవు నీవు- వేదాంతనుత! మహావృషభేంద్ర!” యనుచుఁ
బ్రమథేంద్రపదవికిఁబట్టంబు గట్టి- యమితసర్వజ్ఞత్వమప్పుడిచ్చుడును
నంతట శ్రీధరుఁడంతట నజుఁడు- నంతట దేవేంద్రుఁడంతట సురలు
[5]ధరఁజాఁగఁబడి మ్రొక్కి కరములు మొగిచి- శరణంచు నందికేశ్వరునిఁ గీర్తింప
నతఁడు దయామతి నల్లన నగచు- నతగులౌ సురలను నరవిరికంటఁ
జూచె భయంపడు సురలుఁ దొల్లింటి- యేచిన భీతివోఁజూచినయట్లు
శ్రీగిరినైరృత్యభాగంబు పుణ్య - భాగ మా క్షేత్రంబు పరమపావనము
నందికేశ్వరుని పుణ్యతపంబుచేఁత - 'నందిమండల' మను నామంబుఁదాల్చె
నచ్చట వర్తించునఖిల జీవులకు - నిచ్చితి నపవర్గమిందీవరాక్షి!
దొరకొను నందికేశ్వరుచరితంబు- విరచించువారికి విన్నవారికిని
నచలితబుద్ధి దృష్టాదృష్టసిద్ధి - ప్రచురవచశ్శుద్ధి భక్తిసమృద్ధి
యిట్టిద కావున నీ నందికేశుఁ -డెట్టున్న నేన కా [6]కేల యొండొకఁడె?”
యని యానతిచ్చుడు నఖిలాండపతికి- ననురాగమున జగదంబ కేల్మొగిచి
యన్నందికేశు నందంద చూచుచును - మన్నన దైవాఱ మఱియు నిట్లనియె
“ఈ నిరహంకార మీ సదాచార - మీ నిరంతరభక్తి యీ ప్రభుశక్తి
యీ సిద్ధపాండిత్య మీ నిత్య [7]సత్య - మీ సుకుమారత్వ మీ యాత్మతత్త్వ

  1. లక్ష్మి
  2. దొ
  3. నిగ్గిండి
  4. నాకుఁన
  5. ధరణిఁ జాఁగిలి
  6. కెలమీనొఁడొకఁడె
  7. సత్త్వ