పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

9

అంతటఁ బోవక యాశిలాదుండు - నెంతయు భక్తితో నిలఁజాఁగి మ్రొక్కి
“యభిమతంబగు పుత్రునర్థినిత్రేని - యభవ! [1]నీ [2]భక్తియం దణుమాత్రమైనఁ
దక్కున [3]గలిగినఁదల [4]ద్రుంచివైతు - నక్కుమారునకు నీ వడ్డమైయున్న
నట్టేనిఁగొడుకు నిమ్మటు గానినాఁడు - [5]నెట్టణ నేనొల్ల నీ యిచ్చువరము”

శివుఁడు శిలాదునకు వరమొసఁగుట


నంచు విన్నప మాచరించుడు నతని- సంచితభక్తికి సంప్రీతిఁ బొంది
యాదిసృష్టికి మున్ననాదియై పరగు - నాదిమదీయాంశమగు వృషభంబు
ధర్మరూపమనఁ గృతయుగంబునందు - ధర్మంబు నాల్గుపాదంబుల నడచు
రమణతోఁద్రేతాయుగమునను ధర్మ - మమరఁగ మూఁడు పాదములను నడచు
జగములో ద్వాపరయుగ[6]మందుఁ బాద- యుగమున ధర్మనియుక్తిమై నడచుఁ
బొనరుచుఁ గలియుగంబున నొక్కపాద- మునను జరించు [7]ధర్మనిరూఢి వెలయఁ
దగిలి యిమ్మాడ్కిని ధర్మస్వరూప - [8]మగుట లోకహితార్థుఁ డగు నట్లుఁగాక
పూని ద్వితీయశంభుం డనుపేరఁ- దా నిత్యుఁడై పరమానందలీల
మాకు వాహనమై ప్రమథ ముఖ్యుఁడయ్యు - గోకులపతియయ్యు శ్రీకరమహిమ
వెలసిన యయ్యాదివృషభేంద్రుఁజూచి - "నలి శిలాదునకును నందీశుఁ డనఁగఁ
బుట్టుము; నీవొండెఁ బుట్టంగవలయు - నట్టుగా కేనొండెఁ బుట్టంగవలయు
రూపించి ధర్మస్వరూపులై మహిమ- నేపారుప్రమథగణేంద్రులందెల్ల
మక్కువ పెక్కువ [9]మద్భక్తియుక్తి - యెక్కు[10]వగాఁగ నీ కిచ్చినవాఁడఁ
గాన మిక్కిలిభక్తి గలయట్టిపుత్రుఁ- గాని శిలాదుండు దా నొల్ల ననియె
నిచ్చినవరమింక నేఁదప్పనేర -నచ్చెరువంద మా [11]యనుమతిఁజేసి
పుట్టు ద్వితీయ[12]శంభుండనఁబుడమి - "నట్టిద [13]కా” కని యానందలీలఁ

నందికేశ్వరుని యవతారము


బుట్టె నయోనిసంభూతుఁడై యతని- కిట్టలంబుగ నందికేశ్వరుఁ డనఁగఁ
బుట్టఁగఁ దోడనె పుట్టె మద్భక్తి - పుట్టక యటమున్న పుట్టె మచ్చింత
పరమతత్త్వామృతం [14]బయ చన్నుఁబాలు- గురుపదధ్యానవిస్ఫురణయ వెన్న

  1. మీ
  2. భక్తికి నణు
  3. యైనను
  4. దున్మి
  5. నెట్టన
  6. మున
  7. ధర్మువునన వెలసిత
  8. మగుచు
  9. మాభక్తి
  10. యెక్కుడు
  11. యానతిఁబోయి
  12. శంభుఁడవనఁ
  13. కాకంచునానంద
  14. ఇట్టి రూపము భారతమందున్నది “దరకొని తెగఁగాల్చునట్టిదయ యగుఁజుమ్మీ!” - ఉద్యోగ. ద్వీ-ఆ. ప 197.