పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

బసవపురాణము


శివుఁడు పార్వతితో నందికేశ్వరుని వృత్తాంతము చెప్పుట


[1]నని విన్నవించిన నద్దేవదేవుఁ - డనురాగచిత్తుఁడై యతనికిట్లనియె
“నందికేశ్వరునకు నాకునొక్కింత- సందు లేకునికి నిస్సందేహ మగుట
నీతనిఁ బుత్తెంతు నితనిచేఁబరమ- పూతమై లోకంబు [2]బోధంబు వడయు”
ననవుడు గిరిరాజతనయ ప్రాణేశుఁ - గనుఁగొని ముకుళితకరకంజ యగుచు
“నందికేశ్వరునకు నాకు నొక్కింత - సందు లేకునికి నిస్సందేహ మనుట
[3]భక్తైకతనుఁడవై పలికిన విధమొ? - వ్యక్తిగా నతఁడు నీవై యున్నవిధమొ
యానతి [4]యి"మ్మని యంబిక యడుగ- నా నారదుడు విన నభవుఁడిట్లనియె
"అగునగు నట్టిద యంబుజనేత్రి[5] - తగుఁదగు భక్తైకతనుఁడ నట్లగుదుఁ
జెప్పెద వినుము విశేష [6]మింకొకటి - దప్పదే నతఁడన తర్కించి చూడ
నేమికారణ మనియెదవేని వినుము - తామరసానన! తత్కథాయుక్తి

శిలాదుని తపస్సు


యాది ననేకయుగాదులనాఁడు - నాదరికమున శిలాదుఁ [7]డనంగఁ
దాపసముఖ్యుండు దపమొనరించె- శ్రీ పర్వతంబు నైరృత్యభాగమునఁ
గందమూలాదులు గాలియు నీరు- నిందురశ్ములును [8]దినేశరశ్ములును
నాహారముగఁ ద్రికోట్యబ్దముల్ సలిపి - సాహసంబున మరి శతకోటియేఁడు
లావంతశిల తనకాహారముగను - భావించి ఘోరతపంబర్థిఁ జేయ
నతనికిఁ బ్రత్యక్షమై యేము నిలిచి - మతి నిష్ట మెయ్యది మమువేఁడుమనిన
నత్తఱి నతఁడు సాష్టాంగుఁడై మ్రొక్కి - చిత్తంబులోఁ బ్రీతి సిగు[9]రొత్తి నిగుడ
“సర్వజ్ఞ! పశుపతి! శంకర! శర్వ!- సర్వలోకేశ్వర! శాశ్వత![10] సాంబ!
అవధారు వేదవేదాంతావగమ్య! - అవధారు విన్నపంబాశ్రితసులభ!
శ్రీ మన్మహా[11]దేవ! శివలింగమూర్తి! - యేమిటఁగొఱత యేస్వామి! [12]మీ కృపను
నైనను నాకొక్కయభిమతంబైన - దాని వేఁడెద మహాదాని! యీక్షణమ
నీయట్టివానిని నిజభక్తజనప- రాయత్త! [13]సుతుఁగా దయామతి నొసఁగు”
మనవుడు నతనికి నభిమతార్థంబు - నొనరింప [14]నున్నంత వనజాక్షి! వినవె!

  1. యని
  2. బోధింపఁబడును
  3. భక్తవత్సలుఁడైన
  4. యిండని
  5. అంబుజనేత్రి యనుట పాణినీయముచొప్పున సరికాకున్నను, దెలుఁగున ననేకకవీశ్వరు లట్లే ప్రయోగించిరి.
  6. మిందొకటి
  7. డు నాఁగఁ; డనాఁగఁ
  8. దివసేంద్రురశ్ములును
  9. రారి
  10. రూప
  11. లింగశివదేవమాకు-నే
  12. నీ
  13. త్తుణ
  14. నున్నెడ