పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

బసవపురాణము

శరణుఁడై బసవండు సందు సేకొన్నఁ - బరమభక్తి స్థితి బసవన్న గొలుచు
భక్తుఁడై లింగంబు ప్రకృతి సేకొన్న - వ్యక్తిగా బసవన్న వరవుడు సేయుఁ
బరమాత్మరూప మా బసవఁడే యెఱుఁగుఁ - బరమేశుఁ డెఱుఁగు నా బసవనిరూపు
సాలోక్యసామీప్యసారూప్యపదవు - లోలిని బొంద సాయుజ్యంబుఁజెంద
వచ్చుఁగాకిల బసవస్వామి గాఁగ - వచ్చునే [1]పెఱపెఱవారలకెల్లఁ
బ్రమథాగ్రగణ్యుండు బసవఁడీశునకు - సమశీలభక్తుండు జంగమంబులకు
లింగదేవునకు ననుంగు బసవఁడు - జంగమకోటికి సడిసన్నదాసి;[2]
యెక్కంగ వాహనం బీ[3]శుకు బసవఁ;- డెక్క సింహాసనం బీశుభక్తులకుఁ
గాలకంధరు కరవాలు బసవఁడు; - శీలం[4]బు భక్తుల చేతియద్దంబు;
బసవని నేరి కౌఁబ్రస్తుతి సేయ - [5]వసమె [6]యెవ్వరికైన బసవని నెఱుఁగ
సంపన్నుఁడై లింగజంగమంబందుఁ - బొంపిరిగొని పువ్వుఁగంపునై యుండుఁ
గావున బసవని గణుతింపరామి - దేవాసురులకైనఁ దెల్లమై యుండు;
నెన్నంగ వేడ్కకాఁడెఱుఁగునే దోస- మన్నట్లు గాక యాహవణి గీర్తింప
నిదియుఁ గోటికిఁబడగెత్తినవానిఁ - బదివేల కాఁపవై [7]బ్రదుకు మన్నట్టు
లాపరంజ్యోతిస్స్వరూపంబునకును - దీపకంభంబు లెత్తించినయట్లు
భవనిర్మితములైన పత్రపుష్పములు - భవునకుఁ దగ సమర్పణ సేయునట్లు
గాక కీర్తిం[8]పఁగా నాకుఁ దరంబె - ప్రాకటంబుగ భక్తబండారి[9] చరిత?
మైనను [10]లోకహితార్ధంబు గాఁగ - నా నేర్చుకొలఁది వర్ణన సేయువాఁడ
నవరసరసికత [11]భువినిఁ బేరుగొన్న - శివకవిప్రవరులచిత్తంబు లలర
నిప్పాట నితరులఁ జెప్పెడి దేమి - తప్పనఁదారులు దడఁబడఁబలికి
వెలసినచదువులు [12]వీటిఁబోరిత్త - పొలిసిపోయిరి తమపురులు [13]దూలఁగను
మృడుమహత్త్వముఁగానమిని బొంకులనఁగఁ - బడుఁ “గవయఃకింనపశ్యంతి” యనుట
యనుచుఁ గుకవుల గీటునఁ బుచ్చి పేర్చి - వినుతింతుఁ [14]దత్కథావిధ మెట్టులనిన:

  1. పేర్వేఱు, పెదపెద్ద
  2. దాసుఁడు-అనవలసినచోట నీతఁడు 'దాసి' యని ప్రయోగించుచు. “విష్ణుఁబాసి వ్యాసుఁడు శివుదాసి గాఁడె,” “నుతికి మెచ్చిచ్చెఁ గన్నులు గాళిదాసికి,” “నీదాసి నీలెంక నీడింగరీఁడ” చతుర్వేదసారసూక్తులు. “చెన్నారఁ గాళిదాసియు శివుచేతఁ గొన్న-(కాళిదాస కవినిగూర్చి) పండితారాధ్య4.ప్రకరణము 31పుట
  3. జెప్పు డీశ్వరునకెక్క
  4. పు
  5. బసవని నెవరికి నెఱుంగ
  6. రుమహిమ
  7. ప్రబలు
  8. తునా గానాఁ
  9. భక్త
  10. ని బేర్కొన్న
  11. దారలు (తప్పనదారులు?)
  12. వీటఁబో
  13. మాలఁగను
  14. నిక్కథవిధ