పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

5

నురుతర గద్యపద్యోక్తులకంటె - సరసమై పరగిన జానుఁదెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ - గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱఁ
దెలుఁగుమాటల[1]నంగవలదు; వేదముల - కొలఁదియ కాఁజూడుఁ డిలనెట్టు లనినఁ
[2]బాటి తూమున[3]కును బాటి యౌనేనిఁ- బాటింప సోలయుఁ బాటియ కాదె
అల్పాక్షరముల ననల్పార్థరచన - కల్పించుటయ కాదె కవివివేకంబు
అలరుచు బసవనిఁ దలఁచుతలంపు - బలుపునఁగాఁ జేసి భావ[4]మ్ము మెఱసి
యకలంక లింగ రహస్యసిద్ధాంత - సకల వేద పురాణ సమ్మతంబైన
యాతత [5]బసవపురాతనభక్త - గీతార్థసమితియే మాతృక గాఁగఁ
బూరితంబై యొప్పు పూసల[6]లోన - దారంబు క్రియఁబురాతనభక్తవితతి
చరితలలోపల సంధిల్ల బసవ - చరిత మే వర్ణింతు సత్కృతి [7]యనఁగ
నసదశలింగదేహస్థుడైయున్న - బసవని వేఱొక్క భావంబు గాఁగఁ
దగిలి వర్ణించుట [8]దప్పనవలదు - తగు భక్తివర్ధనార్థంబు దానగుట
బసవని శరణన్నఁ బాపక్షయంబు - బసవని శరణన్నఁ బరమపావనము
బసవని శరణన్నఁ బ్రత్యక్షసుఖము - బసవని శరణన్నఁ భవరోగహరము
బసవని శరణన్నఁ భక్తి సేకూరు - బసవని శరణన్నఁబంధముల్వాయు
బసవని శరణన్నఁ [9]భాగ్యముల్వొందు - బసవని శరణన్నఁబర శీలంబు
బసవని శరణన్నఁ బాయు నాపదలు - బసవని శరణన్నఁ బ్రబలు సంపదలు
బసవని శరణన్నఁ [10]నసలారుఁ గీర్తి - బసవని శరణన్నఁ ఫలియించుఁగోర్కి
బసవని శరణన్నఁ నెసఁగు వాక్సిద్ధి - బసవని శరణన్నఁ భ్రాజిల్లుబుద్ధి
[11]వేయేల తగ "బసవా” యనఁబరగు-నీ యక్షరత్రయం [12]బిటులొక్కమాటు
చదువునెవ్వండేని ముదముతోనతని - వదనంబు శివునకుఁగుదురు దా ననఁగఁ
బాయక బసవనిఁ బ్రస్తుతించినను - బాయుట సోద్యమే భవబంధనములు
బసవండు కేవల భక్తుఁడే తలఁప - నసమాక్షుఁడారూపమై నిల్చెఁగాక
బసవఁడు వసుధపైఁ బ్రభవించునంత - బసవని నరుఁడని పలుకంగఁదగునె?
హరుఁడు [13]నిరాకారుఁ డైనచో బసవఁ - డరయంగ సాకా[14]రుఁడై చరియించు
హరుఁడు సాకా[15]రుఁడై యలరుట సూచి - శరణుఁడై బసవండు సందు లేకుండు

  1. నాఁగ
  2. ఈ ద్విపద కర్థమస్పష్టముగా నున్నది. 'సోలకు' అని యుండవలెనేమో!
  3. కంటెఁ
  4. ముల్ మెఱసి
  5. సకల
  6. లోని
  7. ననఁగ
  8. తప్పునా
  9. భాగ్యంబు లొందు
  10. బసలారు
  11. వేయేమి
  12. బిలనొక్క
  13. నిరాకారమైయున్న
  14. రమై
  15. రమై