పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiii


మోక్షయాత్రను చేయుటకు సాధనంబుగ నున్నది. జీవయాత్రను కైవల్యయాత్రను జేయుటకు బాహ్య్యలింగధారణమును, నంతర్లింగధారణమును నుపయోగపడఁ గలవిధమును వీరశైవాగమములు వివరించుచున్నది. ఈ రహస్యమునే అపరోక్షానుభూతి యందు శంకరాచార్యులు విశదము చేయుచున్నారు :

శ్లో. యత్ర యత్ర మనో యాతి బ్రహ్మణ స్తత్ర దర్శనాత్,
    మనసో ధారణం చైవ ధారణా సా పరా మతా. - అపరోక్షానుభూతి.

శ్రీ గురుకటాక్షము అధికారియైన భక్తునకు వీరశైవదీక్ష నొసంగి కృతార్థునిఁ జేయుచున్నది. వీరశైవదీక్ష కధికారలక్షణములను బసవపురాణము, వీరశైవదీక్షాబోధ ఇటులు వివరించుచున్నవి :

తగనివారికి దీక్షఁ దగఁజేయుగురున - కగుఁబ్రమాదంబు మహాదేవుచేత
గురువులు శిష్యుని గుణవిశేషముల - నరయక దీక్షఁజేయఁగ నెట్లువచ్చు
బాలురకును మద్యపాయికి ద్యూత - శీలికి మాంసభక్షికి నజ్ఞునకును
ఆతురునకు వేశ్య కంగహీనునకు - నీతి గాదట వ్యసనికి దీక్షఁజేయ
నివి దెలియకఁ దీక్షలిచ్చినగురున - కవు నరకంబని హరువాక్యమనుడు.

         * * * * *

గురునాథుఁ డతనిఁ గన్గొని వత్స, వినుము - హరదీక్ష నిమ్మన్న నా పట్టుమనుచు
శిష్యునిశక్తియు శిష్యునిభక్తి - శిష్యుభావముఁ బరీక్షింప కీఁదగునె
యా ముముక్షుఁడు దీక్ష యగుటయే చాలు - నా మీఁద నాచరణంబు దుర్ఘటము
మొదలు సర్వద్వంద్వములఁ బాయవలయు - మదము గర్వముఁ బొడమకయుండవలయు కుత్సితనిష్ఠురకోపమాలిన్య - మాత్సర్యశాఠ్యడంబము లుండఁదగదు
కష్టలోభజ్ఞానకామమోహాది - దుష్టగుణంబులు దొలఁగంగవలయు గుదపాదపాణివాగ్గుహ్యసౌఖ్యములు - గదిసిన వశవర్తి గాకుండవలయు
శాంతంబు ముఖవికాసంబు సద్వృత్తి - దాంతి నీతియు దెల్వి దయయును వలయు సంతోషమును గతస్పర్ధయు ధర్మ - చింతయు సద్గుణశీలంబు వలయు
మొగమోటయును దానమును వినయంబు - తగవు ధర్మార్థసాధకబుద్ధి వలయు
నుచితజ్ఞతయు సత్క్రియోద్యోగధర్మ - రచన పరోపకారంబును వలయు