పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

బసవపురాణము


 
పొంగి చిచ్చుఱకంగఁ బోవుచుఁ జీర
కొంగోసరించు పెన్వెంగలియట్ల
చెల్లుఁ బొమ్మని సన్న్యసింపఁ బోవుచును
నిల్లప్పగించు నయ్యిబ్బందియట్ల
పదపడి నూతిలోఁ బడఁబోయి తాప
వెదకుచు మెట్టెడి వీఱిఁడి యట్ల
జ్ఞానాత్ముఁడై సర్వసంగముల్ విడిచి
తానాశ్రయముఁగోరు తపసిచందమున
నిల మరు ల్వోయె రోఁకలిగొనిరండు
తలఁ జుట్టుకొనియెదఁ దా నన్నయట్లు
పానలేల చెఱకుపందెమం దొక్క
యీనె సిక్కిన నోడుటేకాదె తలఁప
రోసి సంసారంబుఁబాసి యొక్కింత
యాసించెనేనియు నది వెల్తి గాదె?”

ఇక్కడ 'కోపగర్హ' ను బలుదెఱఁగులఁ బ్రపంచించి కోపిని సిగ్గునఁ గూరునట్లు చేసినాఁడు. భావోద్రేకముగలపట్టులిట్టివీగ్రంథమునఁ బెక్కులు గలవు. కవిత్వ రచనాశౌండీర్య మిట్టిది పండితారాధ్యచరిత్రమందింక నెక్కుడుగా నిండారి పండఁబాఱి యున్నది. అది యపూర్వము లగు ప్రయోగములకు, శబ్దములకు, విషయములకు, గనియ. ఆకాలపు టాంధ్రదేశ ప్రజాచరిత్రమున నది యనేక విషయములఁదెలుపుచున్నది. ద్విపదలు జడవాఱి పొడుగులై సాగియుండుటచే నది యన్వయక్లేశమునఁగూడ దీనిని మీఱియున్నది. ఆ గ్రంథముననుండి యెత్తిచూపవలసిన యపూర్వవిషయము లనేకములు గలవు. విస్తరభీతిచే నిక్కడ విడిచితిని.

ముద్రణ విధానము

ఏలూరిలోఁ గందుకూరివారు బసవపురాణమును జాగ్రత్తతోఁ బ్రకటించిరి. దాని నాధారముగాఁ గొని ప్రాచ్యలిఖితపుస్తకశాలలో సి.పి. బ్రౌనుదొర