పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

155

పు. 90 పుటలో మొగచాళము, నవఠాణము, సాళి, పెళ్లాపెళ్లి మొదలగు సంగీత పరిభాషాపదములు పెక్కులును దుర్‌జ్ఞేయములుగా నున్నవి. వాని నెల్ల నేనిక్కడఁబేర్కొన నయితిని.

మఱియు,

అనుగులము - అనుగలము, కొమ్ము - కొమ్మకసువు - కసపు, కడువ-కడవ, వరువుడు -వరవుడు, కుఱుఁగలి-కుఱఁగలి, చనువు- చనవు, పనువు - పనవు, గొడగు- గొడుగు, పెంట్రుక -పెంట్రిక, రూపములు గలవు. ఇందుఁ దొలిరూపములు ప్రాచీనములు. మోఁకాలు, మోఁచేయి, శబ్దములకు, శ.ర.లో మోఁద+కాలు, మోఁద+చెయి, యని నిష్పత్తులు గలవు. మ్రోఁకాలు, మ్రోఁచెయి, యని ప్రాచీనరూపములు. మ్రొగ్గు+కాలు, మ్రొగ్గు+చెయి, అని వాని నిష్పత్తులు. మ్రాను-మాను, మ్రోడు - మోడు, మ్రబ్బు - మబ్బు, స్రడ్డ-సడ్డ, మొదలగు రూపములు నున్నవి. ఇందును దొలివి ప్రాచీనములు. అట, ఇట, ఎట, ఆడ, ఈడ, ఏడ, అచట, ఇచట, ఎచట, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, శబ్దములు, కళలుగాను ద్రుతప్రకృతికములు గాను గలవు. పయి శబ్దములు వ్రాఁతలలో నిరుదెఱఁగులను గలవగుటచే నేను నిరుదెఱఁగులను నుంచితిని.

ఇప్పుడు పేర్కొన్నవిగాక యింకను బెక్కుశబ్దములు శబ్దరత్నాకర సంస్కారమున కుపకరించునవి యిందుఁగలవు. విస్తరభీతిచే నింక విడుచు చున్నాఁడను.

ప్రాఁత పలుకుబళ్లు

అర్వాచీనకవుల కృతులలోనంతగాఁగానరాని వానిని బ్రాఁతపలుకు బళ్లను గొన్నింటి నిక్కడఁ జూపుచున్నాఁడను.

ప్రవేశింపఁదడవ (ప్రవేశింపఁగానే) 147 బాహుయుగ్మముఁ జాపఁదడవ (చాఁపఁగానే) ఇత్యాదులు పెక్కులు. ఎర్రాప్రెగ్గడ హరివంశమునఁగూడ నిట్టి పలుకుబడి గలదు.

పు. 66 కాన నా తప్పునఁగాఁజేసి ( నా తప్పువలన) తలఁచు తలంపుఁ - బలుపునఁగాఁజేసి - (బలుపు వలన).