పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

బసవపురాణము

పు. 245 వర్షాఫలము= వడగల్లు (వర్షోపలమనుటకు వర్షాఫలమనెను)

పు. 171,190 వసది= జైనమఠము (నేఁడు 'బస్తి' యనఁబడును).

పు. 33 వాతపూరణములు= గాలి గుమ్మటములు.

పు. 62 వాళగ్రోలు = పిల్లనగ్రోవి?

పు. 153 విడియలు= రొక్కపు జాలెలు.

పు. 191 విసమాల్చు = మాయించు.

పు. 138 లెంగిలిబంటు= అధమభృత్యుఁడు.

పు. 46, 103 వెండీఁడు= బొమ్మలాడించువాఁడు.

పు. 81 వెడ్లుబుడ్లువెట్టు = నిశ్చేష్టమగు

పు. 224 వెరవిండి= వెరవెఱుంగనివాఁడు.

పు. 42 లెంగులు= అధములు.

పు. 180 వేఁడివెల్ల= వేఁడిబూడిద

పు. 69 వేసరు+ ఆసరు= ఆయాసముచెందు, ఉజ్జగించు.

పు. 22 శివమరులు= సివమెత్తుట.

పు. 112 శివశరణులు= శివుఁడు శరణముగాఁ గలవారు.

పు. 74 సువిధానులు= సువిధానమనుచు హెచ్చరిక చేయువారు.

పు. 214 సడగరంబు = సంభ్రమము, ఉత్సాహోద్రేకము.

పు. 122 సుళువు= తిరుగాటము.

పు. 125 సూనెగాఁడు = కటికవాఁడు.

పు. 130 సొకనాసి= దేవళములో గర్భాలయపు ముందటిపట్టు, 'సుకనాసి' యని శాసనములు.

పు. 240 సోడంబు = ఖడ్గము?

పు. 46 హేళగీఁడు= కథలు చెప్పువాఁడు?

మఱియు

పు. 62 పుటలో ధూకళి, ఝంకళి మొదలగు నృత్యపరిభాషా పదములును,