పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

బసవపురాణము

పు. 99, 191 ఇబ్బంది = అజ్ఞాని

పు. 109 ఇఱివిరి (ఈ పాఠమే యుక్తము) = ఇఱియుట విరియుట - సంకోచ వ్యాకోచములఁ జెందుట, మినుకుమినుకు మనుట,

పు. 132, 229 ఇలుపుట్టు = ఇలువరుసను వచ్చినది.

పు. 80 ఉడుపనేయి = ఉడుమునేయి, పు.

72 ఉద్దెసించు = ఉద్దేశించు, పు.

155 ఉనుపరి = స్వతంత్రుఁడు,

పు. 130, 198, 190, 200, 202. ఎగుదు= ఎగిసి వచ్చు, దూఁకివచ్చు,

పు. 133 ఎడయునుబుచ్చు,

పు. 45 ఎడవుచ్చు,

పు. 68,129 ఎడవోవు = కుంటెనతనమునకుఁ బంపు, కుంటెన తనమునకుఁ బోవు,

పు. 16 ఎరివు= బాధ,

పు. 43 ఏట = గొఱ్ఱె,

పు. 114 ఏటము = సమృద్ధము,

పు. 189 ఐదవెట్టు = ముట్టు.

పు. 80 ఒడిపిలిపాసెము = (శ.ర. లో నిది యప్రయుక్తమని కలదు.) పండఁబాఱినను బచ్చిగానున్న ధాన్యమును దంచిచేసిన బియ్యముతో వండిన పాయసము,

పు. 74 ఒడ్డణము = ఒడ్డాణము,

పు. 139 ఒమ్ము = ప్రియమగు,

పు. 165 ఒఱగోయు = ఒఱనుండిలాఁగు,

పు. 146 ఓజు = అధిపతి, గురువు, ఒజ్జ,

పు. 32 కంభకట్టు = స్తంభములకుఁగట్టి చేయు నలంకారము. మీఁదఁ గట్టి చేయు నలంకారము మేలుకట్టు;

పు. 125 కట్టిల్లు = అంటుకొను,