పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

137


మేర్పడుటచేతనే 'కలగుండు' లో 'ల' తర్వాత నర్ధానుస్వారము లేదయ్యెను. మంచెళ్ళ వాసుదేవపండితుని వైకృతచంద్రికను, పట్టాభిరామ పండితుని పట్టాభిరామ పండితీయమును బ్రమాణముగాఁ గొందుమేని ప్రాచీనభాషా స్వరూపము పఱిపఱి యగును. ప్రాచీనతాళపత్రపుఁ బ్రతులలోఁ గొన్నింట మాత్రమే అనవుడు, నావుడు మొదలగు శబ్దములం దనుస్వారము కానవచ్చును. కాని, పెక్కు ప్రతులనుస్వారము లేకుండఁగూడ నున్నవిగదా! ఆ శబ్దములలో సున్నయుంచి వ్రాసిన ప్రతులకంటె, ఉంచకుండ వ్రాసినప్రతులే యెక్కువని నేను రూపింపఁగలను. ఇఁక నీ విషయము విడిచెదను.

శకటరేఫములు :- తిక్కనాదుల కాలమునకే ఱ-ర-భేదజ్ఞానము తార్మాఱు కాఁజొచ్చినట్టున్నది. అప్పటి శాసనములలోను గ్రంథములలోను గూడఁగొన్ని శబ్దములటు నిటు గానవచ్చుచున్నవి. ఱ, ర భేదమును బాటించి వ్రాసిన తాళపత్రఁపుబ్రతులరుదుగా నుండును. కాఁబట్టి తత్పరిజ్ఞానము మనకు యతి ప్రాసములను బట్టియు, శాసనములను బట్టియు, సాధ్యము. కూఁతుఱు అని శాసనములలో సర్వత్ర ఱ కాననగును. నేఁడందఱు 'కూఁతురు' అనియే తలంతురు. చేకుఱు, సమకుఱు, చేకూఱులు, బండిఱాతోను, సమకూరు, సాదురాతోను శ.ర. లోఁ గలవు. ఇది సరియా? శాసనములలో 'ఱేపు' బండిఱాగా నుండును. భారతమున నది రేయితో యతిలోనున్నది. ఱేపు బండిఱా యగుచో నేఁడు సాదు రా లుగాఁ దలఁపఁబడునవి పెక్కులు బండిరాలు గావలసి యుండును. తీగగదల్చినఁ బొదయెల్లఁ గదలును. 'సగము' అను నర్థమున గొందఱు ప్రాచీనులు 'అర' గాను మఱికొందరు 'అఱ' గాను ప్రయోగించిరి. 'అఱచందురుని క్రొత్తమెఱుఁగులు' హరివంశము 7 ఆశ్వా. (చూ.శ.ర.) అరచందురుడెందము లోఁ | జొరఁబారి - నరకుండు - హరినిటల, ఉత్తర హరివంశము 1 ఆశ్వాసము. మన సోమనాథుఁడును -

పు. 146-'దరహసితాస్యుఁడై తలుపులదిక్కు | నరగంట నొక్కింత యఱలేక చూచి' అని సాధురేఫముగాఁ బ్రయోగించెను. నెఱియ, యని శ. ర. కారులు -