పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

బసవపురాణము


అట్లగుచో నవి నిండుసున్నలుగాఁగూడ మాఱవలెను గదా! ఎక్కడను నట్టి రూపములు గానరావు. అవి నిరనుస్వారములనుటకనేక ప్రయోగములం జూపనగును.

పు. 47- కడుఱొంపిఁ గాలుజాఱుడు -

పు. 72 - 'మృడుఁడు వాలారగించుడు రిత్తకుడుక -

ఇట్టి ప్రయోగములు భారతాదులలోను బెక్కులున్నవి. విస్తరభీతిచే విడుచుచున్నాఁడను. 'కలఁగుఁడు' అను పదమే 'కలగుండు' గా రూపాంతరమును జెందినదనియు నావుడు మొదలగువానిలో ననుస్వారముగలదనుటకిది జ్ఞాపకమనియు నొక వాదము గలదు. ఇది సరికాదు. కలఁగుడు మొదలగు శబ్దముల తుది 'డు' ధాత్వర్థకము. ఇది ప్రాచీనకృతులలోనే హెచ్చుగాఁ గానవచ్చును. నావుడు, అనవుడు మొదలగు శబ్దముల తుది 'డు' ఆనంతర్యార్థకము. ఒకటి కళ, వేఱొకటి ద్రుతాంతము. ఈ రెండింటనుగూడ నరసున్న లేదు. 'కలఁగుడు'నుండి కలగుండు వచ్చెనేని యదీ ధాత్వర్ధకమగు 'డు' సానుస్వారమనుటకు జ్ఞాపకము గావలెనుగాని యానంతర్యార్థకమగు 'డున్'కుఁ గారాదు. అప్పుడు రెండు నొక్కటే యనవలెను. ఒకచోట ద్రుతమును ద్రోసిపుచ్చుటో రెండవచోటఁ జేర్చుటో చేయవలెను. అప్పుడు సంధులలోని చిక్కులను సమర్ధింపవలెను! ఈ కల్పనము తగదు. ఇంత యంగీకరించినను సర్వధాతు సాధారణమైన 'డు' ఎక్కడను బూర్ణానుస్వారమును బొందఁ జాలక యొక్క 'కలగుండు'లో మాత్రము చెందఁగల్గెననుట యుక్తముగాదు. అది యట్లే యగునేని కలఁగుఁడు 'కలఁగుండు' 'కలంగుండు' రూపములుండఁదగునే కాని 'కలగుండు' అని యుండఁదగదు. 'కలగుండు' శబ్దమునకు నే నిట్లు నిష్పత్తి చెప్పుదును. కల్హారము, కహ్లారము నున్నట్లు, 'హిసి' నుండి 'సింహ' మయినట్లు పారువము, పావురము నయినట్లు వర్ణవ్యత్యయముచే 'కలంగుడు' అని 'గు' కు బూర్వముండవలసిన యనుస్వారము 'గు' కుఁ దర్వాతఁబడి 'కలగుండు' అయినది. (కలఁగుడు శబ్దార్థ మాశబ్దమునకే పట్టి కలగుండు అయినది.) అనుస్వారవ్యత్యయ