పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

బసవపురాణము

పు. 32, - సారార్థములప్రోఁక జ్ఞానాగ్నికాఁక' అని, సానుస్వారముగానే గ్రహించెను. కుమారసంభవమును, శబ్దరత్నాకరమును, నమ్మి దీనిని నేను నిరనుస్వారముగానే తలఁచి, యీ ముద్రణమునఁదొలుతఁ గొన్నిపట్టుల ననుస్వారమును (c ?) అని కుండలీకరించి యుంచితిని. ఇట్లే మఱిపెక్కు శబ్దములఁ గూర్చి సంశయము గలదు. కొన్ని ప్రాచీనశాసనములలో 'పెరుగు' నిరనుస్వారముగా నున్నది. 'తనకు నసమువెరుగ' సోమలదేవి దాక్షారామ శాసనము.[1] మార్కండేయ పురాణముననుండి సానుస్వారమనుటకు లక్ష్యముగా శ. ర. లో నీ క్రింది పద్యముదాహృతము.

క. అనఘ మదాలసకడుపున
    జనియించియు యోగిమాత చనుగుడిచి పెరిం
    గిన తనయు లితరవనితల
    తనయులు చనుత్రోవఁ జనఁగ దగియెడువారే
    ఇది యిట్టుండవలెను.
    జనియించియు యోగిమాత చనుగుడిచియుఁ బె
    ర్గినతనయు..................................................
    మార్కండేయపురాణమున నుండియే

    'ఉత్తముఁ డనఁగంబరంగు నుర్వినని మునుల్‌'

అని పద్యము నుదాహరించి, శబ్దరత్నాకరకారులు 'పరగ' సానుస్వార మనిరి.

'ఉత్తముఁడను పేరఁబరగె నుర్వినని మునుల్'

అని వ్రాఁతప్రతుల పాఠము. పరగ నిరనుస్వారమే, 'చాగు' లో నరసున్న లేదేమో! కొన్ని వ్రాఁతలలోఁ గలదు. ప్రాచీన కవులెల్లరును, సానుస్వారముగాఁ బ్రయోగించిన 'ఏఁగు' నిటీవలివారు నిరనుస్వారముగాఁ గ్రహించిరి. ప్రాచీనులు,

  1. రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక, దక్షిణ హిందూదేశ శాసన సంచయము IV చూ.