పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

బసవపురాణము


డిగియెద.' శల్య 2 ఆశ్వా - అని తిక్కన 'ఏను' కళగాఁ బ్రయోగించెను. 'ఏనవిదప' అను సంస్కారము తప్పు. 'ఏనువెనుక' అని పాఠము కలదందురు గాని యది నాకే ప్రతిలోను గానరాలేదు. ఆ శబ్దములను బ్రాచీనులు కళలనుగానే ప్రయోగించిరని నా నమ్మకము. కళలు గనుకనే 'ఏను' పై 'పిదప' 'విదప' అయినది. మఱియు, నే| ను గరంబుత్సుక వృత్తితో- నిర్వచనో, 4 ఆశ్వా. ఈ ప్రయోగము ద్రుతాంతత్వమునకును సాధకమే. కాని, ప్రాచీన ప్రతులలోఁ బెక్కింటఁ దాను, నేను శబ్దములమీఁది కచటతపలు గసడదవలుగాఁ గాన వచ్చినవి. బసవపురాణపు వ్రాఁత ప్రతులలోనున్న పాఠమును నేను మార్పఁ జాలనయితిని.

కాన కళయే :- బసవపురాణపు వ్రాఁతప్రతులలోను భారతాదుల వ్రాఁతప్రతులలోను, ఎక్కడఁజూచినను కాన కళగానే కానవచ్చును. ధృతరాష్ట్రుండును, - కా | న తగంబొందుట' యని తిక్కన ప్రయోగము గలదు. వందల కొలఁది స్థలములలో నది కళగానే వ్రాయఁబడి యున్నది. ప్రాచీనగ్రంథములలో నెక్కడను నది ద్రుతాంతముగాఁ గానరాదు. 17వ శతాబ్దినుండి రచితములయిన గ్రంథములలోనే యది ద్రుతప్రకృతికముగా మాఱినది. ప్రాచీనగ్రంథములలో 'కాన' అనియే 'న' లఘువగునట్లు వందలకొలఁది పట్టుల నున్నదిగాని 'కానన్' అని గురు వగునట్టుగా నెక్కడను ద్రుతముతోఁ గానరాదు. అది కళ యనుట కిదియొకటియే ప్రబలసాధనము కాఁదగును.

స్త్రీ, పుం వాచకములు :- పు. 108, 'సడిసన్నదాసి' (పుం.) కొడుకులు లేమికిఁగడుదుఃఖి యగుచు' (స్త్రీ), వనిత యపూర్వలాంఛనధారిగాఁగ' (స్త్రీ) ఇత్యాదిస్థలములఁబుంలింగరూప ముండవలసినచోట స్త్రీలింగరూపమును స్త్రీలింగరూపముండవలసినచోటఁ బుంలింగరూపమును నీ కవి ప్రయోగించి నాఁడు. (పుట6, పుట్‌నోట్ చూచునది.)[1]

  1. దాసుఁడు అనవలసినచోట నీతఁడు 'దాసి' యని ప్రయోగించుచు 'విష్ణుఁబాసి వ్యాసుఁడు శివదాసిగాఁడె,' 'నుతికి మెచ్చిచ్చెఁగన్నులు' 'గాళిదాసికి' (నీ దాసి నీ వెంక నీ సింగరీఁడ' చతుర్వేదసార సూక్తులు. చెన్నారఁ గాళిదాసియు శివుచేతఁ గొన్న (కాళిదాస కవిని గూర్చి) పండితారాధ్య 4 ప్రకరణము 31 పుట.