పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

131


గూలునని యాటోపంబు దీపింప', 'వికృతములైన... నీవు బీ | తు కుడిచివచ్చి నోరికొలఁదుల్' - భాస్కర. యుద్ధకాండము.

క. ఆపద్వినీతులగుదురు
    కాపురుషులు పరమ పురుషకారుణిక గుణుల్
    శ్రీ పాటింప వినీతులు
    నాపద్దశకంటె దశదిశాంకాభరణా!

- బద్దెన నీతిసారముక్తావళి.

ఇవియెల్లఁ బ్రాచీన ప్రయోగములు. క్రియల పయిని బ్రథమాంతముల పయిని నాదేశము లేకున్నందుకర్వాచీన కవిప్రయోగములనెక్కువగాఁ జూపవచ్చును. 'వయ | శ్శ్రీ చన రెంటికిం జెడిన రేవఁడనౌదునె నీరజేక్షణా' మనుచరిత్రము. - ఇఁక నవ్యయములపై నీయాదేశము నానావిధములఁగలదు. అవధారణార్థకము, క్త్వార్థకము మొదలగువానిపైఁ గానరాదు. అట్లు, ఏమి, మొదలగువానిపై నిత్యముగాఁగానవచ్చును. అన్ని యవ్యయముల మీఁదను బ్రాసస్థానప్రయోగములు దొరకకున్నవి. ఇతరస్థలముల విషయము వ్రాఁతలలో నిరుదెఱఁగులను నుండును. ప్రాచీన కాలముననే యీ యాదేశము సునిశ్చితముగా నుండలేదు. శాసనములు గూడఁ గొంతవఱకు వీనియనిశ్చితతను నిరూపించుచున్నవి. ప్రాచీనతర శాసనములరీతి ననుసరించి తొలుత నీ యాదేశము నీ గ్రంథమునఁ బూన్కితోఁబాటింపఁదలఁచితినిగాని, భారతాది ప్రయోగముల ద్వైవిధ్యమును, దాళపత్ర గ్రంథములంతగా నీ నియమమును బహుకాలమున నుండియే పాటింపకుండుటను, వర్తమాన పాఠకలోకమున కీ విధమపరిచితమగుటను, గొన్ని యెడల నర్థక్లేశమును గలిగించుటను, అచ్చులోనపూర్వమయిన మార్పగుటచే నెంత జాగ్రత్తగాఁ జూచినను గన్నువంచించి కొన్ని పట్టులు గానరాకుండుటను, బర్యాలోచించి, యాపూన్కిని వీడి నేనును బహుళముగానే యీ యాదేశము నిందుఁ బాటించితిని.

పు. 131 - ఏనువోయెద - తాను నేను శబ్దములు ద్రుతాంతములుగా వ్యాకరణములందుఁ బరిగణితములగును. 'ముందరదముడిగుమే | ను విదప